చిత్తూరు

ఎస్వీయూ వేదికగా ప్రత్యేకహోదాపై రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 19: రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈనెల 22న తిరుపతికి వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఏఐసీసీ సభ్యుడు, చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మార్టిన్ లూథర్ చెప్పారు. సత్యవేడు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పెనుబాల చంద్రశేఖర్‌ను పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జారీ చేసిన నియామక పత్రాన్ని మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమక్షంలో అందజేసి ఆయన్ను అభినందించారు. ఈసందర్భంగా మార్టిన్ లూథర్ మాట్లాడుతూ 2014 ఎన్నికల ప్రచార సమయంలో ఎస్వీయూ క్రీడామైదానం నుంచి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని మోదీ ప్రకటించారని, ఎన్నికల తరువాత అదే వేదికపై నుంచి తాను హోదా ఇస్తానని చెప్పలేదని ప్రకటించి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారని తెలిపారు. ఇందులో భాగంగా పీసీసీ చేపట్టిన బస్సు యాత్ర ఈనెల 22న తిరుపతికి చేరుకుంటున్న సందర్భంగా రాహుల్ గాంధీ తిరుపతికి వస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఎస్వీయూ తారక రామ క్రీడామైదానంలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై స్పష్టమైన ప్రకటన చేస్తారన్నారు. ప్రత్యేక హోదా కోరుకునే అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఆయన చెప్పారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 110 మంది అభ్యర్థులు తాము రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ దరఖాస్తులను అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో యువకుడు, విద్యావంతుడు అయిన పెనుబాల చంద్రశేఖర్‌ను రాహుల్ గాంధీ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం శుభపరిణామమన్నారు. ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో యువతకు పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగానే పెనుబాల చంద్రశేఖర్‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా సముచిత స్థానం కల్పించారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి తిరుపతికి రాహుల్ గాంధీ రావడం ఆనందంగా ఉందని, ఆయన రాకతో పార్టీలో నూతనోత్సాహం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటా
పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తనపై ఎంతో బాధ్యతను ఉంచారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి, 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పెనుబాల చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశంలో నేడు అనాగరిక పాలన సాగుతోందని విమర్శించారు. ప్రతి వర్గం ప్రజలు, మహిళలు అభద్రతతో జీవించాల్సి వస్తోందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈనెల 22న రాహుల్ గాంధీ పాల్గొనే సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకీ పదవి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ పెనుబాల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి సింధూజ, నగర అధ్యక్షురాలు సావిత్రి యాదవ్, చిత్తూర పార్లమెంట్ ఇన్చార్జ్ రాజగోపాల్, నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, చిట్టిబాబు, ఖాన్, సురేంద్ర, బుల్లెట్ రవి, శివకుమార్, నారాయణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.