చిత్తూరు

లడ్డూ ట్రేలను శుభ్రపరిచేందుకు యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 7: శ్రీవారి లడ్డూ ప్రసాదం ట్రేలను వేడినీటితో శుభప్రరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలని టిటిడి ఇఒ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ నూతన యంత్రాలను కొనుగోలు చేయడం వల్ల ఒక గంటలకు 500 ట్రేలను శుభ్రం చేయవచ్చని అన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పిస్తున్న దర్శన స్లాట్లను ఉదయం 9 నుంచి ప్రారంభించాలని తెలిపారు. వర్షాకాలంలో శ్రీవారి ఆలయం, మాడ వీధులు, రూ. 300 క్యూలైన్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల లగేజీని తిరిగి అప్పగించే విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఈఓ సూచించారు. రద్దీ రోజుల్లో లగేజీ అప్పగించేందకు దాదాపు అరగంట పడుతోందని ఈ సమయాన్ని 5 నుంచి 10 నిమిషాలకు తగ్గించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశించారు.
శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో మరింత పారదర్శకతల పెంచేందుకు సిఫారసు లేఖలు అందించే వారి నుంచి డిజిటల్ సంతకాలు సేకరించాలని, ఇలా చేయడం వల్ల దళారుల ఆటకట్టించవచ్చని అన్నారు. ఈ సమావేశంలో టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎఫ్ ఏ, సి ఏ ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.