చిత్తూరు

రాష్ట్ర వ్యాప్తంగా 42వేల పాఠశాలల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవణంపల్లె, జూన్ 17: రాష్ట్ర వ్యాప్తంగా గల 42వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషిచేస్తూ 5వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు వెల్లడించారు. శుక్రవారం మండలంలోని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు నిర్మించిన అమర్‌రాజా విద్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, యూనిఫాం, పుస్తకాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని ఆవిధంగా అంత నిధులు వెచ్చించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చదువులు నేర్పిస్తుందని అన్ని సదుపాయాలున్నా రాష్ట్ర వ్యాప్తంగా 6440మంది పదోతరగతిలో పది గ్రేడ్ సాధించినా ప్రభుత్వ పాఠశాలలో ఆరు శాతం మందికి మాత్రమే పది గ్రేడ్ వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని అందరూ భాగా చదువుకుంటేనే రాష్ట్భ్రావృద్ధిని విద్యార్థులు చదువు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా వివరించారు. ఇటీవలే రాష్ట్రంలోని 13జిల్లాల విద్యాశాఖాధికారులతో సమావేశమై పాఠశాలల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని చర్చించానన్నారు. గల్లా రామచంద్ర నాయుడు, అరుణకుమారి దంపతులు పారిశ్రామికంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఎందరికో నిరుద్యోగ సమస్యలను తీర్చడమే కాకుండా విద్యాస్థాయి విద్యలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ గల్లా కుటుంబం ద్వారా నిరుద్యోగ సమస్యలు తీరుతున్నాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ విద్యారంగంపై కూడా దృష్టి సారించిన ఆదర్శ దంపతులని కొనియాడారు. కార్యక్రమంలో గల్లా రామచంద్రనాయుడు అరుణకుమారి దంపతులు మాట్లాడుతూ అమర్‌రాజా కంపెనీలోపనిచేసే కార్మికుల వారి పిల్లలు చదువుకునేందుకు స్థానిక ప్రజల సౌకర్యార్థం విద్యాలయాన్ని నెలకొల్పామన్నారు. తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే దృక్పథంతో విద్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. మాజీ ఎంపి పాటూరు రాజగోపాల్‌నాయుడు ఆశయం మేరకు ఇలాంటి కార్యక్రమాలు రూపొందించామన్నారు. జడ్పి చైర్‌పర్సర్ గీర్వాణి మాట్లాడుతూ అరుణకుమారి కుటుంబం వారి తండ్రి ఆశయం మేరకు విద్యాసంస్థలపై దృష్టి సారించడం, అటు పారిశ్రామికంగాను ఎందరికో ఉపాధి కల్పించి మన్ననలు పొందుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, వెంకటేశ్వరచౌదరి, బంగారుపాళ్యం ఎ ఎంసి చైర్మన్ జయచంద్రనాయుడు, గల్లా రామచంద్రనాయుడు, ఎజెసి సుబ్బారెడ్డి, డిఇఒ నాగేశ్వర్‌రావు, ఎంపిపి సరళకుమారి, జడ్పిటిసి వెంకటేశ్వరచౌదరి, ఎస్‌ఎస్‌ఎ పిడి లక్ష్మి, తహశీల్దార్, వరలక్ష్మి, సర్పంచ్‌లు మహేష్, కుమారనాయుడు పాల్గొన్నారు.