చిత్తూరు

అవకాశం ఇస్తే చిరు 150 చిత్రంలో నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 23 : అవకాశం ఇస్తే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో తప్పకుండా నటిస్తానని సినీనటి స్నేహ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహ బస చేసిన అతిథి భవనంలో తనను కలిసిన విలేఖరులతో ఆమె మాట్లాడుతూ అనేక తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశం తనకు దక్కిందని అన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం రాలేదని చెప్పారు. చిత్రాలకు దూరమైనా చిరంజీవి తిరిగి తన 150వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన 150వ చిత్రంలో నటించే అవకాశం తనకు వస్తే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదని ఆమె అన్నారు.