చిత్తూరు

తిరుమల కనుమ మార్గంలో రెండు రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 17: తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో కనుమమార్గంలో రెండు వేరువేరుప్రాంతాల్లో ఆదివారం వాహనాలు రోడ్డుప్రమాదాలకు గురయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. రెండవ ఘాట్‌రోడ్డులో అలిపిరికి 2 కిలో మీటర్ల దూరంలో ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. అలాగే 4వ కిలోమీటర్ వద్ద ప్రభుత్వ వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే వాహనాల్లో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి గాయలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. కాగా కాలువలో ఇరుక్కుపోయిన కార్లను టిటిడి ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం కు చెందిన డి ఐ భాస్కర్ నాయుడు నేతృత్వంలో సిబ్బంది క్రేన్‌ల సహాయంతోకార్లను తొలగించి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.