చిత్తూరు

లడ్డూ కౌంటర్లలో పరిశుభ్రతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, నవంబర్ 28: శ్రీవారికి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూపంపిణీ విధానాన్ని మరింత పరిశుభ్రంగా అందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులకు, సిబ్బందికి చేతి తొడుగులు ధరించి అందించేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఇ ఒ సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమల్లోని శ్రీవారి ఆలయంలోని పోటు,లడ్డూ కాంప్లెక్స్‌ల్లోని లడ్డూ కౌంటర్లను, యాత్రికుల వసతీ సధన్-2ను శనివారం ఇఒ తనిఖీ చేశారు. ముందుగా ఆలయంలోని పోటులో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జాస్ట్ఫ్యాన్, చిన్నపాటి మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న లడ్డూ బూంది తయారీ కేంద్రాన్ని సందర్శించారు. బూంది తయారీ యంత్రాల పనితీరును, లడ్డూ ట్రేలు, పరికరాలను శుభ్రపరిచే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లీనింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది పనితీరు గురించి ఆరా తీయగా సిబ్బంది కొరత కారణంగా పని ఆలస్యమవుతోందని తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఇ ఒ సంబంధిత అధికారులకు సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లడ్డూ కౌంటర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. లడ్డూ కాంప్లెక్స్‌లో ప్రస్థుతం ఏ కౌంటర్ నుంచైనా భక్తులు లడ్డూలు పొందే అవకాశం ఉందన్నారు. మరింత పారదర్శకత పెంచడంలో భాగంగా 8 కౌంటర్లను శ్రీవారి సేవకులతో నడుపుతున్నట్లు వీటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. త్వరలో శ్రీవారి సేవకుల సేవలను 12 కౌంటర్లకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. అలాగే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఉండేందుకు ముందుగా తయారైన వాటిని ముందుగానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నేషనల్ న్యూట్రిషన్ విభాగం, మైసూరులోని సిఎఫ్‌టిఆర్ సంస్థల సలహాలతో ప్రసాదాల నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం యాత్రికుల వసతి సముదాయాన్ని ఆయన పరిశీలించారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో పిఏసిలతోపాటు అన్ని విశ్రాంతి సముదాయాల్లో గీజర్లు పనిచేసేలా చూడాలని అలాగే లేనిచోట్ల తక్షణం వాటిని అమర్చాలని అయన అధికారులను ఆదేశించారు. ఇ ఒ వెంట ఆలయ డిప్యూటి ఇ ఒ చిన్నంగారి రమణ, ఎస్ ఇ -2 రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ షర్మిష్ట, పోటు ఏ ఇ ఒ అశోక్ ఇతర అధికారులు ఉన్నారు.
2న తిరుమలలో ధార్మిక సదస్సు
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన తిరుమల్లోని ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు జరుగనుందని టిటిడి ఇ ఒ సాంబశివరావు తెలిపారు. ఇందులో హైందవ ధర్మ పరిరిక్షణ, వ్యాప్తి కోసం గ్రామస్థాయి నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, గ్రామస్థులను ఎలా భాగస్వాములను చేయాలి తదితరల అంశాలపై ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని చర్చిస్తారన్నారు. ఈసదస్సు నిర్వహణకు టిటిడి అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు
శ్రీవారిని దర్శించుకున్న కాంగ్రెస్‌నాయకులు
తిరుమల, నవంబర్ 28: తిరుమలేశుని శనివారం పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు దర్శించుకున్నారు. వీరిలో ఏ ఐ సిసి కార్యదర్శి తిరునావక్కరుసు, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, తులసీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌లు ఉన్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎ ఐ సిసి కార్యదర్శి తిరునావక్కరుసు మాట్లాడుతూ దేశప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవదేవుని ప్రార్థించానన్నారు. ఇటీవల దేశంలో కాంగ్రెస్‌పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ఆయన్ను ప్రశ్నించగా తిరుమల్లో రాజకీయాలు మాట్లాడటం సబబుకాదని అన్నారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన వరద సహాయం త్వరలోనే అందేలా కేంద్రానికి మనస్సు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఐదు రోజుల్లోగా కీ పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను సమర్పించండి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
చిత్తూరు, నవంబర్ 28: జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు త్రైమాసిక కీ ఫర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను ఐదు రోజుల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ సంబంధిత అధికారులను అదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల్లో లక్ష్యాలు, సాధించిన ప్రగతితో పాటు జీవి ఏ లక్ష్యం మేరకు నివేదికలు రూపొందించి సమర్పించాలన్నారు. వార్షిక రుణ ప్రణాళికలు, మైక్రో ఎంటర్ ప్రైనూర్స్, వ్యవసాయ, ఉద్యానవనం, సూక్ష్మ, ఎస్టీ, ఎస్టీ రుణాల ప్రగతి తదితరాలతో నివేదికలో వివరించాలని ఎల్‌డీ ఎంను ఆదేశించారు. వ్యవసాయంలో ఖరీఫ్ పంట మార్పిడిలు అయిన తరువాత చేపట్టాల్సిన చర్యలు, రబీకి సిద్ధం కావాల్సిన అంశాలపై నివేదించాలని ఆయా శాఖాధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ, సిసి రోడ్లు నిర్మాణం, వర్ష నివేదికలతో అనాలసిస్ తయారు చేయాలని సీపీవోను ఆదేశించారు. వర్షాలు బాగా కురిసినందున విరివిగా మొక్కలు నాటాలని అటవీశాఖాధికారులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పథకాల యూనిట్లస్థాపనపై జియో ట్యాగింగ్ పద్దతిలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్, డి ఆర్‌డి ఏ , డ్వామా విభాగాల్లో చేపడుతున్న పలు అంశాలపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాజధాని శంకుస్థాపన మనకు సంకల్పబలం
* ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు
వాల్మీకిపురం, నవంబర్ 28: రాజధాని అమరావతి శంకుస్థాపన ముహుర్తం మనకు సంకల్పబలం చేకూరిందని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. శనివారం వాల్మీకిపురంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రాయలసీమలో కరవు నెలకొనివుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన నూతన రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన చేసిన ముహుర్తబలం మనకు కలిసి వచ్చిందని ఆయన అన్నారు. ఆముహూర్త బలంతోనే వర్షాలు సమృద్ధిగా పడి మంచి కాలం వచ్చిందన్నారు. రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని అన్ని ప్రాజెక్టులు సందర్శించి మేడికుర్తి ప్రాజెక్టును మాత్రం ఎందకు సందర్శించలేదని విమర్శించారు. వరద ప్రాంతాలలో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీచేస్తోందన్నారు. ఈ సమావేశంలోచింతగింజల శ్రీరామ్, కేశవరెడ్డి, సురేంద్రవర్మ, మండల కన్వీనర్ భాస్కర్‌నాయుడు, కధీమ్, హైదర్, ఆది తదితరులు పాల్గొన్నారు.