చిత్తూరు

సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ముఖ్యమంత్రి రాజధాని నుంచి వివిధ శాఖల కార్యదర్శులు, ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలు, పథకాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ఇంకనూ సాంధించాల్సిన లక్ష్యాలపై ఫవర్‌పాయింట్ ద్వారా ఆయా శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా సీ ఎం మాట్లాడుతూ ప్రజోపయోగకంగా వినూత్న పథకాలకు రూపకల్పన చేయాలని, వివిధ రంగాల్లో అవసరమైన వారికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. మానవవనరులు, విద్యారంగాల్లోనే కాకుండా అనుబంధ రంగాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. భూగర్భ, ఉపరితల జలాలను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయి వరకు టెక్నాలజీ ఉపయోగాన్ని తీసుకెళ్లాలని, ఇందుకు సంబంధించి అన్ని శాఖల్లో ఐటీ కమిటీలను నియమించాలని సూచించారు. ఈ గవర్ననెస్ సక్రమంగా అమలైతే 20 నుంచి 30 శాతం ప్రగతి సాధించవచ్చని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలిపారు. మరుగుదొడ్లు, దీపం గ్యాస్ పథకంలో వందశాతం ప్రగతిని సాధించాలని ఆదేశించారు. కాగా ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, డీ ఆర్వో విజయ్‌చందర్, సీపీవో భాస్కరశర్మ, డ్వామా, డీ ఆర్‌డీ ఏ పీడీలు, ఉద్యానం, పశుసంవర్థకం, వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్, అటవీ, రవాణా తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.

రేపు తిరుపతి కోర్టు ఎదుట చింతా నిరాహార దీక్ష
తిరుపతి, నవంబర్ 28: తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరుపతి కోర్టు ఎదుట నిరాహార దీక్ష చేయనున్నట్లు తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయకపోవడంతో పాటుగా కనీసం హైకోర్టు కూడా లేనికారణంగా ఈప్రాంతంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన తెలిపారు. హైకోర్టును సైతం ఉత్తరాంధ్రకు తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. హైకోర్టును సాధించే వరకు తన పోరాటం ఆగదిని ఆయన స్పష్టం చేశారు.

రూ. 4.5లక్షల ఎర్రచందనం సహా కారు స్వాధీనం
కలకడ, నవంబర్ 28: కారు సహా రూ.4.5లక్షలు విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై రాయచోటి నుండి పీలేరు వైపు వెళుతున్న డబ్ల్యూబి 02 టి 1249హుండాయి కారులో 40కిలోల దుంగలు పీలేరు వైపు తరలిస్తుండగా పక్కా సమాచారంతో తనిఖీ చేసి కారును స్వాధీనం చేసుకుని ఇద్దర్ని శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పాకాలకు చెందిన పి.జయరాం(50), పుంగనూరుకు చెందిన కె.శ్రీరాములు (27) ఎర్రచందనం తరలిస్తుండగా అరెస్ట్ చేశామని మిగిలిన 9మంది పరారయ్యారన్నారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ చంగయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ రాజేంద్ర, రాజారెడ్డి, రెడ్డిబాషా, రమేష్, మధుకర్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.