చిత్తూరు

పెంచిన పెట్రోలు, డీజల్ ధరలు వెంటనే తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 1: ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు చాలీ చాలని జీతాలతో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం తాజా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడం దుర్మార్గమని ఎ ఐ టియుసి అథ్యక్ష, కార్యదర్శులు మురళి, హరికృష్ణ నిప్పులు చెరిగారు. పెరిగిన పెల్రోలు డీజల్ ధరలను నిరసిస్తూ ఎ ఐ టియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటోకు తాళ్లు కట్టి లాగి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆయిల్‌పూల్ అంకౌంట్ అనే విధానం ఉండడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు అదుపు చేయడానికి ఒక మార్గం ఉండేదన్నారు. పాలకులు ఆ విధనాన్ని రద్దు చేయడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎపుడు ఎలా ఉంటాయో తెలీకుండా అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఆయిల్‌పూల్ అకౌంట్ రద్దు అయిన నేపథ్యంలో రూ.90 వేల కోట్ల రూపాయలు దిగమింగారని ఆరోపించారు. విమానాలకు, సముద్రంలో నౌకలకు కేంద్రప్రభుత్వం రాయితీలిస్తోందని, తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు మాత్రం రాయితీలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. రూ.3.5లక్షల కోట్ల రూపాయలు రాయితీవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు రాయితీలొస్తాయన్నారు. నేడు పెరిగిన పెట్రోలు ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి సామాన్యుడి బతుకు పై మరింత భారం పడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఎ ఐ టియుసి నాయకులు ఎన్ డి రవి, కె.వై రాజా, రాధకృష్ణ, శివ, జగన్నాథం, మునుస్వామి, రామకృష్ణ, శివ, భాస్కర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో..
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) శెట్టిపల్లి సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజల్ ధరలతో వాహనాలను నడపలేమని మోటారు బైకులను ఎద్దుల బండిపై ఊరేగింపు నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మంగలం బిటి ఆర్ కాలనీలో గురువారం నాయకులు, కార్యకర్తలు బైకులను ఎద్దుల బండిపై ఎక్కించి బండిని లాగుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కానుకగా పెట్రోలు, డీజల్ ధరలు పెంచి భారం వేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీపట్టణ నాయకులు కె రాధకృష్ణ, పి బాబు, ఎన్‌డి రవి, కృష్ణ, మాధవ, ఆనంద్, ఉదయకుమార్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.