చిత్తూరు

ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 5: ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల్లో ప్రజల్లో అడుగంటిన భక్త్భివాన్ని చైతన్యపరచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేదిశగా తాళ్లపాక అన్నమాచార్యులు స్వామివారిపై సంకీర్తనలు రచించి ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లారని టిటిడి పురాణ, ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 513వ వర్థంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య అన్నమయ్య ఆధ్యాత్మిక విశేషాలు అన్న అంశంపై ఉపన్యసిస్తూ శ్రీహరి కృప వల్ల అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలకు వ్యాఖ్యానం రాసే అవకాశం తనకొచ్చిందన్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ బాధ్యతను నిర్వహించి పలు కీర్తలనకు పండితులు ఆమోదం పొందేలా వ్యాఖ్యానం రాసినట్లు వివరించారు. ఈకీర్తనలలో వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని అంశాలను అన్నమయ్య స్పృశించారన్నారు. అన్నమయ్య బ్రహ్మస్వరూపమని, ఆయన అనుసరించింది బ్రహ్మమార్గమన్నారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవ జీవనాన్ని చవిచూశారన్నారు. విజయవాడకు చెందిన డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర వైభవం అన్న అంశంపై మాట్లాడుతూ శ్రీహరిపై విశ్వాసం ఉంచిన వారి జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయన్న విషయాన్ని అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలిపారన్నారు. స్వామివారిపై భక్తితో లాలి పాటలు, ఉయ్యాల పాటలు, ఉత్సవ , వైరాగ్య, తాత్విక, శృంగార, ఆధ్మాత్మిక కీర్తనలు రచించారని తెలిపారు. ఆళ్వార్లు వేదాల వాంగ్మయాన్ని తెలియజేయడంతో పాటు సామాజిక జీవనాన్ని కూడా అద్భుతంగా వర్ణించారన్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ బి. శ్రీరాములు అన్నమయ్య- శ్రీరామ సంకీర్తనలు అన్న అంశంపై ఉపన్యసిస్తూ రాయలసీమ, కర్ణాటకలోని పలు రామాలయాలను అన్నమయ్య సందర్శించి కీర్తనలు రచించారన్నారు. వీటిలో రాయలసీమలోని ఒంటి మిట్ట, గండికోట, దాసరి పల్లి, వాల్మికిపురం, గుత్తిలోని ఆలయాలు, కర్ణాటక హంపి ప్రాంతంలోని విజయనగర రాజుల కాలంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయన్నారు. సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్ట్భాషేకంతో పాటు రామాయణంలోని పలు సన్నివేశాలు ఈ కీర్తనల్లో గోచరిస్తాయన్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ షేక్ షావళి
అన్నమయ్య- సూరదాసు అనే అంశంపై ఉపన్యసిస్తూ వీరిరువురూ మానవజాతిని జాగృతం చేసేందుకు కీర్తనలు రచించారన్నారు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై, సూరదాసు శ్రీ కృష్ణుడిపై భక్తితో రచనలు చేశారన్నారు. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనంలో ఏదో ఒక దాని ద్వారా భగవంతున్ని కొలిస్తే తప్పక మోక్షం సిద్ధిస్తుందని వీరిరువురూ తెలిపారన్నారు. ఈ సందర్భంగా ఉపన్యాసకులకు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు బొమ్మారెడ్డి శారద శాలువ కప్పి సన్మానం చేయడంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కె. సర్వోత్తమరావు, హిందూ ధర్మప్రచార కో- ఆర్డినేటర్ చెన్నకేశవులు నాయుడు, ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్ లత పాల్గొన్నారు.