తెలంగాణ

ఫిలింనగర్ క్లబ్‌‌కు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌ (ఎఫ్ఎన్‌సీసీ)ను తెరవడానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. నిర్మాణంలో ఉన్న ఎఫ్ఎన్‌సీసీ భవనం ఇటీవల కూలిపోవడంతో క్లబ్‌ను మూసివేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్లబ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ విభాగం సైతం నివేదికను అందజేసింది. మూడు నెలలలోపు జేఎన్టీయూ ఇంజనీర్లు ఎత్తిచూపిన లోపాలను సరిచేసుకోవాలని ఆ తర్వాత జేఎన్టీయూ ఇంజినీర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. క్లబ్ తెరిచేందుకు అనుమతినివ్వాలంటూ ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జేఎన్టీయూ ఇచ్చిన నివేదికను జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు క్లబ్ తెరిచేందుకు అనుమతిని నిరాకరించింది.