ఐడియా

సౌందర్య పోషణకు పెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో పెరుగు ఎంతగానో ఉపకరిస్తుంది. ఎండవేడి కారణంగా వాడిపోయిన చర్మానికి సహజకాంతిని ఇది కలిగిస్తుంది. కొన్ని ఇళ్లలో ఇప్పటికీ పిల్లలకి వొంటినిండా పెరుగు రాసి మర్దనా చేసి స్నానం చేయిస్తారు. చిక్కటి పెరుగులో కాస్త ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. పెరుగులో శెనగపిండి, నిమ్మరసం కలిపి రాసుకున్నా ముఖచర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. పెరుగులో తేనె కలిపి శరీరానికి రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఓట్స్ పిండిలో కాస్త పెరుగు కలిపి శరీరానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. శిరోజాలకు ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కప్పుడు పెరుగులో కాస్త నిమ్మరసం లేదా మెంతిపొడి కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానే్న ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. పెరుగులో సున్నిపిండి కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంపై ముడతలు అంతరిస్తాయి. ఇక పెరుగుతో చేసే పలు వంటకాలు ఎంతో రుచిని అందిస్తాయి. పెరుగు వడ, ఆవ పెరుగు పచ్చడి వంటివి చేస్తుంటారు. వంకాయ, టమాటో, కొబ్బరి కోరు, పొట్లకాయ, క్యారట్, అరటి దవ్వ, క్యాబేజీ వంటి కూరగాయలతో పెరుగుపచ్చడి చేస్తారు.
కొన్ని చిట్కాలు..
వంకాయ ముక్కలను ఉడికించినపుడు కొద్దిగా పెరుగు వేస్తే అవి రంగు మారకుండా ఉంటాయి. అరటిపువ్వును కోసి నీటిలో వేసేటపుడు కాస్త పెరుగు కలిపితే చేతికి మరకలు అంటవు.

-వినీతామూర్తి