జాతీయ వార్తలు

తీవ్ర తుపానుగా మారనున్న ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘గజ’ తీవ్ర తుపానుగా మారనున్నది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారి రేపు మధ్యాహ్నాం పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది చెన్నైకు తూర్పున 570 కిలోమీటర్లు, నాగపట్నానిక ఈశాన్యంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను గంటకు 6కిలోమీటర్ల వేగంతో వాయువ్య పశ్చిమ దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరందాటే సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సమాచారం. కడలూరు తీర ప్రాంతంలో మీటరు ఎత్తున అలలు ఎగిసిపడతాయని అన్నారు. పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.