Others

‘డ్రీమ్‌గర్ల్’ కొత్త అవతారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం జనం మదిలో మెదిలేందుకు ‘సెలబ్రిటీ’లు తపన పడుతునే ఉంటారు. ఏదోఒక విధంగా వార్తల్లో నిలుస్తునే ఉంటారు. ఇదే కోవలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని (67) ఇపుడు గాయనిగా తన అభిమానులను అలరించబోతున్నారు. ‘డ్రీమ్‌గర్ల్’గా ప్రేక్షకజన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అందాల నటి మధుర నియోజకవర్గ నుంచి బిజెపి ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే కళారంగంలోనూ కృషి చేస్తున్నారు. ముంబైలోని లతామంగేష్కర్ స్టూడియోలో హేమ తాజాగా ఓ భజన గీతాన్ని ఆలపించగా సంగీత దర్శకుడు వివేక్ ప్రకాష్ రికార్డు చేశారు. నారాయణ్ అగర్వాల్ రాసిన భజన గీతాన్ని పండిట్ జస్రాజ్ పర్యవేక్షణలో ఆమె రాగయుక్తంగా పాడారు. తాను ఆలపించిన భజనగీతాల ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు హేమమాలిని ‘ట్విట్టర్’లో ప్రకటించారు. కాగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధుర (యుపి) నియోజకవర్గాన్ని వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తానని ఆమె ప్రకటించారు. ‘స్వచ్ఛ భారత్’ పథకం కింద మధుర జిల్లాలో భారీ ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన మధుర ప్రాంతాన్ని నందనవనంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని, ప్రజాసేవలో కృషిచేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కానని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. సంగీతాభిమానుల ప్రోత్సాహం, మద్దతు ఉంటే మరిన్ని ఆల్బమ్‌లకు రూపకల్పన చేసే ఆలోచన ఉందని ఆమె పేర్కొన్నారు. తాను ఇపుడు గాయనిగా సత్తా చాటుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాటలు పాడడం మరచిపోలేని ఓ మధురానుభూతి అని హేమ అంటున్నారు. తనలోని కొత్త వ్యక్తిని తాను ఆవిష్కరిస్తున్నానని, రాగాలాపనలో ఇంతటి ఆనందం ఉందని తనకు ఇపుడే తెలిసిందని ఆమె అంటున్నారు.