మెయిన్ ఫీచర్

మహిళలకు మర్యాద ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరతీస్తూ, వార్తల్లో ‘సంచలన వ్యక్తి’గా నిలిచే బాలీవుడ్ శృంగార భామ పూనమ్ పాండే ఇపుడు- ‘మహిళల పట్ల మర్యాద చూపే పద్ధతి ఇదేనా..?’ అంటూ నిరసన గళం విప్పింది. అభిమానుల కోసం తన అర్ధనగ్నచిత్రాలను, వీడియోలను తరచూ ‘ట్విట్టర్’లో పోస్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ తన మనసు గాయపడిందని తాజాగా ఓ టీవీ చానల్‌పై విరుచుకుపడడం సంచలనం సృష్టించింది. పదునైన వ్యాఖ్యలతో వివాదాలను సృష్టించేందుకు తెగ ఆసక్తి చూపే పూనం తన వ్యక్తిగత విషయాలపై అసత్యాలు ప్రచారం చేయడాన్ని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె గర్భస్రావం చేయించుకున్నట్లు ఓ చానల్‌లో వచ్చిన తాజా కథనం వివాదాన్ని రగిలించింది.
షూటింగ్‌లతో తాను బిజీగా ఉన్న సమయంలో- గర్భస్రావానికి సంబంధించి వచ్చిన కథనం తనను ఎంతగానో కలచివేసిందని పూనం చెబుతోంది. ఈ కథనంపై వివరాలను ఆరా తీయాలని ఆమె తన మేనేజర్‌ను పురమాయించడమే గాక, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ఎలా ప్రసారం చేస్తారని ఆ చానల్ విలేఖరిని గట్టిగా నిలదీసింది. వ్యక్తిగత జీవితాలపై బాధ్యతారహితంగా ఇలాంటి కథనాలు ప్రసారం చేసినందుకు సంబంధింత మీడియా సంస్థపై వంద కోట్ల రూపాయల మేరకు పరువునష్టం దావా వేస్తానని ఆమె ప్రకటించింది. విమర్శలకు, వివాదాలకు తాను ఎప్పుడూ భయపడేది లేదని, అయితే- తాను గర్భస్రావం చేయించుకున్నట్లు నిరాధారమైన వార్తలు రావడం ఎంతగానో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘ఏ సెలబ్రిటీల గురించి కథనాలు రాయాలన్నా వందసార్లు ఆలోచించాలి.. అందుకే ఆ మీడి

యాపై వందకోట్లకు నష్టపరిహారం దావా వేశా..’- అని పూనం చెబుతోంది. తన అందచందాలకు సంబంధించి ఎన్నో నగ్నచిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉన్నా తాను ఏమీ చలించలేదని, మనసు గాయపడడం వల్లే ఇపుడు పరువునష్టం కేసు దాఖలు చేయాల్సివచ్చిందని ఆమె అంటోంది. సెలబ్రిటీలపై రకరకాల వదంతులు రావడం సహజమేనని, అయితే ‘గర్భస్రావం’ వంటి పుకార్లు తనకు తొలిసారిగా కోపం తెప్పించాయని వివరిస్తోంది. ‘ఒక మహిళకు సంబంధించి- ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంటూ ఇష్టానుసారం ఎలా మాట్లాడతారు..? స్ర్తిలకు ఇచ్చే మర్యాద ఇదేనా?’- అని పూనం నిలదీస్తోంది. ‘మహిళల పట్ల సభ్యతను మరచిపోయి ఇలాంటి వ్యక్తిగత అంశాలపై ఆధారాలు లేకుండా వార్తాకథనాల్ని ఇవ్వాల్సిన్న అవసరం ఉందా?’ అని ప్రశ్నిస్తోంది. అభిమానుల కోసం తాను తరచూ ‘ట్విట్టర్’లో ఫొటోలు పెడుతున్నానంటే అది కేవలం వారి వినోదం కోసమేనని, తన వ్యక్తిగత జీవితంపై అసత్యాలను ప్రచారం చేయాలని తాను ఎవరికీ లైసెన్స్ ఇచ్చినట్లు కాదని అంటోంది. తన అశ్లీల ఫొటోలు, వీడియోల గురించి తెలిసినా వాటి గురించి తల్లిదండ్రులు ఏనాడూ తనను ఆరా తీయలేదని, అయితే తొలిసారిగా వారు ‘గర్భస్రావం’ కథనం గురించి తనను ప్రశ్నించడం విస్మయం, ఆవేదన కలిగించాయని పూనం వివరిస్తోంది.
బాధ్యత లేకుండా ఇస్తున్న కథనాల వల్ల ఇలాంటి మానసిక వేదన ఏ మహిళకూ రాకూడదని అంటోంది. నిజానికి తన నగ్నదృశ్యాలను, వీడియోలను తాను ఏనాడూ వెబ్‌సైట్లలోకి ‘పోస్ట్’ చేయలేదని, తన పరిమితులేమిటో తనకు తెలుసునని చెబుతోంది. సంచలనాల కోసం కొందరు ‘సరిహద్దులు’ దాటుతూ తన వ్యక్తిగత జీవితంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు కథనాలను సృష్టించేవారిని ఇక క్షమించే ప్రసక్తేలేదని పూనం హెచ్చరిస్తోంది.