హైదరాబాద్

ఎందుకు ఆదుకోరూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండి చూపడాన్ని తెలంగాణ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. బడ్జెట్‌పై ఇప్పటి వరకు అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్ పార్లమెంట్‌లో గళాన్ని పెంచింది. కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం ఇతోధిక సహాయం చేయకపోగా కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలనైనా నెరవేర్చక పోవడం పట్ల టిఆర్‌ఎస్ ఆగ్రహంగా ఉంది. కేంద్ర బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆందోళన పథాన్ని ఎంచుకోవడంతో అదే ఇదే ఆదునుగా తెలంగాణ సర్కార్ కూడా గత రెండు మూడు రోజులుగా పార్లమెంట్‌లో గళాన్ని పెంచింది. ఒకవైపు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిలదీస్తుంటే తెలంగాణ సర్కార్ నోరు మెదపకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టిఆర్‌ఎస్ భావిస్తుంది. కేంద్రం వైఖరి పట్ల తెలంగాణ మంత్రులు, ఎంపీలు బహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సిఎం కె చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు వౌనంగానే ఉన్నారు. తన అసంతృప్తిని నేరుగా ప్రధాన మంత్రికే తెలియజేయాలని శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీతో అపాయింట్ లభించే పక్షంలో నేరుగా ఆయనకే తన అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఒకవేళ అపాయింట్‌మెంట్ లభించని పక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించనున్నారని తెలిసింది.
ఎన్డీయేకు మిత్రపక్షం కాకపోయినా పెద్ద నోట్ల రద్దుతో పాటు కేంద్రం తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అండగా నిలబడినప్పటికీ కొత్త రాష్ట్రం తెలంగాణను ఆదుకోవడంలో మాత్రం ఆశించిన మేరకు చొరవ కనబర్చడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని తన ఢిల్లీ పర్యటనలో ఎన్టీయో పెద్దల వద్ద వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్‌లో కేటాయింపులో న్యాయం జరుగకపోయినా కనీసం విభజన హామీలనైనా ఎందుకు నెరవేర్చడం లేదని ముఖ్యమంత్రి నిలదీయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. కోటి ఎకరాలకు సాగునీటి అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని మొదటి నుంచి కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులకు బడ్జెట్‌లో వంద కోట్లకు మించి కేటాయించకపోవడం ఈ డిమాండ్ పట్ల తాము వత్తిడి చేయడం లేదని టిఆర్‌ఎస్ ఎంపి బి వినోద్‌కుమార్ అన్నారు. అయితే దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో వినూత్న పథకాలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ ముఖ్యంగా కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రశంసిస్తున్నారు తప్ప నయా పైసా విదిలించడం లేదని టిఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్ల సహాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది.