విజయవాడ

దశాబ్దాల సాంప్రదాయానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 9: ఏపీఎస్‌ఆర్టీసీలో గడచిన కొన్ని దశాబ్దాలుగా కండక్టర్ల చేతుల్లో కన్పిస్తూ వచ్చే ట్రే బాక్స్‌లు ఇక బూతద్దం పెట్టి వెతికినా కన్పించబోవు. టికెట్ ఇష్యూంగ్ మిషన్‌లు ‘టిమ్స్’ వచ్చిన తర్వాత కూడా వీటిని తమ వెంట ఉంచుకుని కాపాడుకోవాల్సి రావటం కండక్టర్లకు శిరోభారంగా మారుతోంది. దీనివల్ల కండక్టర్ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నందున ట్రే బాక్స్‌లను తొలగించాలంటూ ఎంతోకాలంగా కార్మికులు యాజమాన్యాన్ని కోరుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయరావు ఈ ట్రే బాక్స్‌ల విధానాన్ని రద్దుపరుస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే గుర్తింపు ఎన్నికల్లో తాము గెలిచిన వెంటనే ఇతర అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆర్టీసీలో గత దశాబ్దకాలంగా క్రమేణా అన్ని బస్సుల్లోను కండక్టర్లు ‘టిమ్స్’ వినియోగించేలా చర్యలు చేపట్టారు. అంతకుముందు డ్యూటీలోకి ప్రవేశించే ముందు టిక్కెట్లను ట్రే బాక్సుల్లో పెట్టి ఇచ్చేవారు. అయితే ‘టిమ్స్’ వచ్చినా నేటికీ అదే విధానం కొనసాగుతున్నది. అదేమని ప్రశ్నిస్తే మార్గమద్యంలో ‘టిమ్స్’ మిషన్‌లు ఆగిపోతే టిక్కెట్టు ఇచ్చేందుకు వీలుగా కొన్ని టిక్కెట్లను ఆ బాక్స్‌ల్లో పెట్టి అందజేస్తున్నారు. అయితే ఈ విధానం సరికాదని ‘టిమ్’ ఆగిపోతే ఎంఆర్ బుక్ ఇచ్చి పంపిస్తే ప్రయాణికులకు అందులో నుంచి రశీదు ఇచ్చి డిపోకు చేరుకుంటామని లేదంటే ఆ ట్రే బాక్సుల్లో విలువైన టిక్కెట్లలో ఏ ఒక్కటి గాలికి ఎగిరిపోయినా, లేక గల్లంతయినా మార్గమధ్యంలో తనిఖీ అధికారులు కేసులు రాస్తున్నారని భయపడుతూ వచ్చారు. దానివల్ల తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోతున్నదని అన్నారు. ఇక నుంచి ట్రే బాక్స్‌లను తొలగిస్తున్నందున ఒక్కో డిపోకు అదనంగా 20 టిమ్స్‌ను అందచేయబోతున్నారు. అయితే మార్గమధ్యంలో పొరబాటున టిమ్స్ పాడైపోతాయనే ఉద్దేశంతో కండక్టర్‌కు ఇక రూ.5, రూ.10ల టిక్కెట్లు కొన్ని ఇస్తారు. వాటిని తాత్కాలికంగా ఉపయోగించి డిపోకు చేరిన తర్వాత మరో టిమ్స్ తీసుకుని వెళ్లవచ్చు. ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు ప్రతి కండక్టర్ కూడా తమ వద్దనున్న ట్రే బాక్సుల్లో టిక్కెట్లు సరిగ్గా ఉన్నాయో, లేవో ఎవరైనా తీసి వేసారేమో, టిక్కెట్లు రాలిపోయాయేమో అనే భయంతో టెన్షన్‌గా ఉండేవారు.