బిజినెస్

ఆర్టీజీఎస్ పనితీరు అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ(ఆర్టీజీఎస్) అద్భుతంగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్ చంద్ కితాబిచ్చారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ అహ్మద్ బాబు ఆర్టీజీఎస్ పనితీరును వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఈ కేంద్రం సేవలు అందిస్తున్న తీరును తెలియజేశారు.
పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎలా పరిష్కరిస్తున్నదీ వివరించారు. తొమ్మిది నెలల కాలంలో పరిష్కార వేదిక ద్వారా 1,48,50,297 ఫిర్యాదులు స్వీకరించామని అందులో 93 శాతం పరిష్కరించామని తెలిపారు.