విజయవాడ

ఫలించిన టీడీపీ పోరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి రావలసిన నిధులపై పార్లమెంటులో పోరాడుతున్న టీడీపీ కృషి ఫలించింది. బడ్జెట్ కేటాయింపులు చేయాలంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను ఆర్ధిక మంత్రి జైట్లీ, అమిత్‌షా, పీయూష్‌గోయల్ చర్చలకు పిలిచారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, సీఎం రమేష్ వారితో భేటీ అయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమక్షంలో కూడా ఒకసారి భేటీ జరిగినట్లు తెలిసింది. మధ్యాహ్నం రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో టీడీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న వాటిలో మెజారిటీ అంశాలను ఆమోదించేందుకు జైట్లీ అంగీకరించారు. హోదా నిధులు ఒకేసారి విడుదల, పారిశ్రామిక కారిడార్లు వంటి డిమాండ్లు కూడా అందులో ఉన్నాయి. అయితే, సభా నిబంధనల ప్రకారం తాను వీటిని తన ప్రసంగంలో చేర్చలేదని జైట్లీ చెప్పినట్లు తెలిసింది. దుగ్గరాజపట్నం పోర్టు బదులు మరొకటి ఎంచుకోవాలని సూచించారు. రెవిన్యూలోటు, ప్యాకేజీపై కొంత గ్యాప్ ఉండటం వల్లే ఆలస్యమైందని వివరించారు. రైల్వే జోన్‌పై రెండు, మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని పీయూస్ చెప్పినట్లు సమాచారం. వీరి భేటీ ముగిసిన తర్వాత రాత్రి ఏడుగంటలకు జైట్లీ తన ప్రసంగంలో తొలి పేరాను ఏపీకి ఇచ్చే వాటిపైనే మాట్లాడటం బట్టి, టీడీపీ ఎంపీల ఒత్తిడి ఫలించినట్లు స్పష్టమవుతోంది. కాగా, సప్లిమెంటరీ సెషన్‌లో వీటిని ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ ఎంపీలు అంచనా వేస్తున్నారు. అయితే.. దీనిపై టీడీపీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. వీటిని మొత్తం బడ్జెట్‌లో చేర్చే వరకూ ఆందోళన కొనసాగించాలని, దానిపై తాము పార్టీ పరంగా మాట్లాడే కంటే.. కేంద్రమే ప్రకటించాలన్న ధోరణి ప్రదర్శిస్తోంది. అందుకే దీనిపై పార్టీ నేతలు తొందరపడి హర్షం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
శుక్రవారం రాత్రికి రాష్ట్రానికి 400 కోట్లు విడుదల
జైట్లీ ప్రకటన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి 400 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం విశేషం. అయితే అవి చెప్పుకోదగ్గ స్థాయిలో కాకపోయినా టీడీపీ ఎంపీలు డిమాండ్ చేసిన సాయంత్రానికే విడుదల కావడం ప్రస్తావనార్హం. 14వ ఆర్ధిక సంఘం నిధుల కింద 369.16 కోట్లు, జాతీయ ఉపాథి హామీ పథకం నిధుల కింద 31.76 కోట్లు విడుదల చేసింది. దీనిపైనా టీడీపీ నుంచి స్పందన కనిపించలేదు.

సస్పెండయినా సరే వెనుకాడవద్దు: బాబు
కాగా ఉదయం ఎంపీలతో టెలీకాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు, జైట్లీ ప్రసంగంలో పాతపాటే వినిపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేరేవరకూ పోరాడాలని, సస్పెండయినా వెనుకాడవద్దన్నారు. కేంద్రం నుంచి కాలపరిమితతో కూడిన నిర్దిష్ట ప్రకటన వచ్చే వరకూ ఆందోళన కొనసాగించాలని ఆదేశించారు. బంద్‌లో మన పార్టీ పాల్గొనడం ద్వారా ఏపి ప్రజానీకం ఏం కోరుకుంటుందో కేంద్రానికి చెప్పామన్నారు. 19 హామీలు నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగించాలన్నారు. ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.