సాహితి

దృశ్యపాటవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళామతల్లి కాలిమువ్వల సవ్వడి కడుపులో
అరవైనాల్గు రంగుల రాగఝురులు
మనసులో గిలిగింతలు పూయించే లయ తాళాలు
సంగీత, సాహిత్య,
చిత్ర శిల్ప లలిత కళా గేయాలు
సాధారణ జీవి హృదయ కేదారాలు.
ఒక్కటి రంగరించుకున్నా
చక్కని కళాతపస్సే.
కలం హలం కాయితం క్షేత్రాన్ని దునే్నసినా
రాగఝురిలో హంగులు గళమెత్తినా
రాతి గుండె గూడు మీద ఉలి నాట్యమాడినా
ఆహార్యం కప్పుకున్న అంగ విన్యాసమలరించినా
కళాకల్పవల్లికి కైమోడ్పులే.
సుప్రజారాజాధికారం నుండి ప్రజాస్వామ్యం
పాటవాల ఆటల దాకా
కళాతపస్వి జీవన పథం
రంగురాళ్లు-ముళ్ల కంపల మయమే.
లక్ష్యం అగమ్య గోచరమే.
ఆస్థానాల గుర్తింపు ఆరాటంతో అంగలార్పులు
ప్రజాస్వామ్యం పోకడలో పోరాట పటిమలు.
పలుకుబడి, పాఠాల పరిశోధనతోనే
గుర్తింపు పలుకరింత, మనసు పులకరింత.

రాజీబాజాలు నాకొద్దంటే
కళాకాంతి అడవిగాచిన వెనె్నల.
రంగుల కలలోనే రతనాల మెరుగులు

రాజీవీడిన లోకంలో
కలతల కోతికొమ్మాటలు
పై‘రవి’ కొలతలకందని ప్రతిభా పాట(వా)లు
నడి సంద్రములో జడివానలు
ప్రశంసల కుంభవృష్టికి పరిమితమైతే
పస్తుల పర్వంలో దాగుడుమూతలు
అదృష్టాన్ని లాక్కుంటేనే రాగాలు-్భగాలు
కాదని కలహిస్తే అదృశ్య దృశ్యపాటవం

- ఐతా చంద్రయ్య, 9391205299