క్రీడాభూమి

హాంకాంగ్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఫెడ్ కప్ టెన్నిస్ ఆసియా/ఓషియానియా గ్రూప్ వన్ లీగ్‌లో భాగంగా శుక్రవారం హాంకాంగ్‌ను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో కర్మాన్ కౌర్ 6-3, 6-4 ఆధిక్యంతో ఇడియా చోంగ్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో అంకిత రైనా 6-3, 6-2 ఆధిక్యంతో లింగ్ జాంగ్‌పై గెలిచి, భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థన తంబారే, ప్రాంజలా యడ్లపల్లి 6-2, 6-4 ఆధిక్యంతో వాన్ యా ఇంగ్, చింగ్ హు ఊ జోడీని ఓడించారు.

ఆంక్షల సడలింపు
పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 9: ఉత్తర కొరియా అధికారులపై విధించిన ఆంక్షలను వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి సడలించింది. దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో శుక్రవారం ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియాకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులు హాజరయ్యే విషయంలో చివరి వరకూ ఉత్కంఠ నెలకొంది. అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగాలు వంటి కార్యకలాపాలతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో, ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. అయితే, దేశాధ్యక్షుడు కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్, ఉత్తర కొరియా క్రీడా మార్గదర్శక కమిటీ చైర్మన్ చో వెయ్ తదితరులు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు అతనుమతినివ్వాల్సిందిగా చేసుకున్న విజ్ఞప్తిపై సమితి సానుకూలంగా స్పందించింది. వారిపై ఆంక్షలను సడలించడంతోపాటు, తమతోపాటు విలువైన సామాగ్రిని తీసుకెళ్లడానికి కూడా అనుమతించింది. ఐక్యరాజ్య సమితి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, పలువురు అధికారులతో కలిసి కిమ్ యో జాంగ్ శుక్రవారం ఉదయం పయాంగ్‌చాంగ్ చేరుకుంది. విమానాశ్రయంలో దక్షిణ కొరియా అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.