నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. దేహమున్నవఱకు మోహసాగరమందు
మునుఁగు చుందురు శుద్ధ మూఢ జనులు
సలలితైశ్వముల్ -శాశ్వతంబనుకొని
షడ్బ్రమలను మానఁ జాలరెవరు

సర్వకాలము మాయ సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి
నిందఁ జేయక తాము నిలువ లేరు

తే. మత్తులైన ట్టి దుర్జాతిమనుజులెల్ల
నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!

భావం:
ఓ స్వామీ! బొందిలో ప్రాణమున్నంతకాలం వ్యామోహాలకు గురియై , సంపదలే శ్వాశతమనుకొని అరిషడ్వర్గాదులకు దాసులై జ్ఞానార్జనకై గురువుని ఆశ్రయించరు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు గల సాధువుల్ని చూస్తే తిట్టకుండ ఉండలేరు. ఈ దుష్టులకు నీ సంగతి ఏ మాత్రం తెలీదు.