భక్తి కథలు

లేదు మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతస్యహి ధృవో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్తాద పరిహార్థే న త్వం శోచితుమర్హసి॥ -్భ.2-27

‘ఓ అర్జునా! పుట్టిన వారికి మరణం తప్పదు; మరణించిన వారికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలుకాని ఈ మరణ జనన విషయంలో దుఃఖం తగదు.
ర ర ర
ఆత్మకు మరణం లేదు - శరీరమే మరణిస్తోంది. ఆత్మ మళ్లీ మళ్లీ జన్మలు తీసుకుంటోంది - పునరపి జననం - పునరపి మరణం! ఈ జీవిత సత్యాన్ని భగవద్గీతలో అత్యంత విశదంగా, సూక్ష్మంగా, స్థూలంగా, అనంతంగా బోధించారు శ్రీకృష్ణ భగవానులు. శ్రీకృష్ణుని రూపంలో మనకు తరతరాలు, యుగయుగాలు స్మృతిలో ఉంచుకోవలసిన ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మోపదేశాన్ని అందించారు జగద్గురువులైన వేదవ్యాస మహర్షి.
నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకునే వరకూ మనిషి ఈ సంసార చక్రభ్రమణంలో మునిగితేలుతూ, మరణిస్తూ, జన్మిస్తూ ఉంటాడు. జెయింట్ వీల్ తిరుగుతున్నట్లుగా క్రిందికి మీదకు - మీదకు క్రిందకు వెళుతున్నట్లుగా శరీర విరమణ చేసిన ఆత్మ సూక్ష్మ లోకాలకు వెడుతుంది - సూక్ష్మ లోకాల్లో ఉన్న ఆత్మ శరీరధారియై భూమి మీదకు వస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఎన్నో శిక్షణలు - ఎన్నో అనుభవాలు! అనుభవమే జ్ఞానం! ఒక్కొక్క జన్మలోనూ ఉపాధులు, జన్మస్థలాలు, స్ర్తిలు, పురుషులు - మారుతూ ఉంటాయి జన్మలు సరికొత్త ఆత్మానుభవాల కోసం. స్ర్తిలు పురుషులుగా, పురుషులు స్ర్తిలుగా జన్మ తీసుకుంటారు తమతమ సంకల్పాలను బట్టి.
ఈ భూమిపైన శిక్షణలున్నాయి తప్ప శిక్షలు లేవు. భగవంతుడు సత్యసాక్షి. సర్వసాక్షి. ఒకరిపైన స్నేహం - మరొకరిపైన శత్రుత్వం లాగా ఉండదు సృష్టితత్త్వం. అన్ని రకాల జన్మలూ ఉంటాయి ప్రతి అంశాత్మకూ! ఒకరిని బానిసగా హింసించిన వాడు ఆ అనుభవం కోసం కోరి మరుజన్మలో బానిసగా జన్మ తీసుకుంటాడు. ఒకరిని చంపినవారు మరొక జన్మలో కోరుకుని జన్మ తీసుకుని చంపబడతారు మరొకరితో!
ఈ సంసార చక్రం నీటిని తోడే యంత్రంలాగా ఎడతెగక తిరుగుతూనే ఉంటుంది. ప్రకృతిలో ఏ రకంగానైతే సూర్యోదయం - సూర్యాస్తమయం నిరంతరంగా జరుగుతుంటాయో, అదే రకంగా ఈ జనన మరణాలు కూడా అనివార్యంగా జరుగుతుంటాయి. మహాప్రళయం వచ్చినపుడు ముల్లోకాలు కూడా నశించిపోతాయి అని నుడివారు ‘సంత్ జ్ఞానేశ్వర్’.
సమత్వం యోగ ఉచ్యతే! సమత్వం వచ్చేవరకు ప్రతి ఆత్మ స్వరూపం ఒకటొకటిగా అన్నీ నేర్చుకోవలసిందే. కలిమి - లేమి, బాధ - సౌఖ్యం, మానం - అవమానం, పదవిలో ఉండడం - పదవి పోవడం, గౌరవం - అగౌరవం, జననం - మరణం.. వీటన్నిటినీ సమదృష్టితో చూసే స్థితి ప్రాప్తించేవరకు అన్ని అనుభవాలు పొందవలసిందే అందరూ.
ఈ జన్మలో దుర్యోధనుడు - వచ్చే జన్మలో ధర్మరాజు. గత జన్మలో రావణుడు - ఈ జన్మలో రాముడు. అన్నీ మనమే. అంతా మనమే. ధ్యానం చేసి వేటగాడు వాల్మీకి అయ్యాడు. సాధన చేసి ఎరుకలవాడు ఏకలవ్యుడయాడు. అనుగ్రహం వల్ల కాలుడు కాళిదాసు అయ్యాడు. బోధన వల్ల అంగుళీమాలుడు బుద్ధుడయ్యాడు. ఒ (సశేషం)

-మారం శివప్రసాద్