హైదరాబాద్

పాలన అస్తవ్యస్థమై ప్రజల అవస్థలు పెరిగాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో పాలన పడకేసిందని, విద్య, వైద్య రంగాలతో పాటు పరిపాలన స్తంభించిందని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఉచిత విద్య మాటలు వల్లె వేయడమే తప్ప అమలులోకి రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమంది జీవనం కొనసాగిస్తున్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో 30 పడకల ఆస్పత్రులు, అసెంబ్లీ కేంద్రంలో వంద పడకలు, జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్న వైద్య రంగానికి రోగం వచ్చిందని ఆయన ఆరోపించారు. పోలీసుశాఖలో సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , పోలీసులకు కనీసం బదిలీ అవకాశం కూడా ఇవ్వడం లేదని, టిఆర్‌ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలూ అస్తవ్యస్థమై ప్రజల అవస్థలు పెరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం బాగుపడిందని, విత్తనాల కొరత లేదని, సాగునీరు అందిస్తున్నామని , రుణాలు అద్భుతంగా అందిస్తున్నామని గిట్టుబాటు ధరతో సంబంధం లేకుండా ఆదుకుంటోందని , వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెబుతున్న నేతలు చెబుతున్నారని కాని వ్యవసాయం దండగగా మార్చారని ఆరోపించారు. గిట్టుబాటు ధర విషయంలో పట్టింపులకు పోయి నిర్లక్ష్యం వహిస్తూ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలోనూ కేంద్రంపై బాధ్యత వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. వ్యవసాయం సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. రైతుల అప్పులు సకాలంలో అందుతుంటే , 24 గంటలూ నీరు అందిస్తుంటే వ్యవసాయ విస్తీర్ణం ఎందుకు తగ్గిందో చెప్పాలని ఆయన నిలదీశారు. కందుల కొనుగోలు విషయంలో భిన్నమైన నివేదికలు పంపించి కేంద్రాన్ని అయోమయంలో పడేసిందని అన్నారు. కంది పంట ఎంత ఉత్పత్తి అవుతుందో కూడా లెక్కలు లేవని ఆరోపించారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలూ కేంద్రంపై నెట్టివేసి రాష్ట్రప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని అన్నారు. రాష్ట్రం ఏమీ చేయకుండానే వ్యవసాయం పండగ ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. ఎకరానికి నాలుగు వేలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. నిథులు ఇవ్వని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలు లేకుండా పోయాయని, బదిలీల్లో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని అన్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమైందని, అన్నింటినీ నాన్చ్ధోరణితో వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడటంతో అనేక మంది అసౌకర్యం ఏర్పడిందని, దానిపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేకపోవడం దారుణమని ఆయన అన్నారు.
గుజరాత్‌లో ఆరోసారి బిజెపి అధికారంలోకి వచ్చిందని టిఆర్‌ఎస్ నేతలు గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రెండు లక్షల ఇళ్లకు అనుమతి ఇస్తే ఇంత వరకూ రాష్ట్రప్రభుత్వం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో లెక్కలు చెప్పాలని అన్నారు. ఆంధ్రాలో రెండు లక్షల 90 వేల ఇళ్లకు అవకాశం ఇస్తే అక్కడ కూడా తొందరగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.
మీడియా మద్దతుతో పవన్ నేత అవుతాడా?
మీడియా మద్దతుతో రాజకీయ నేత కావాలని పవన్‌కళ్యాణ్ చూస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడి సహకారంతో సినీ పరిశ్రమకు వచ్చారని, ఆయన హావభావాలు చూస్తే నవ్వొస్తోందని అన్నారు. బుధవారం నాడు కోర్ కమిటీ సమావేశం జరగనుందని, కోర్ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనపై చర్చిస్తామని అన్నారు. ఇకపై జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే హంగ్ వస్తుందని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ పాదయాత్ర యోచన ఉందని, త్వరలో దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవల్సి ఉందని పేర్కొన్నారు. సిఎం అపాయింట్‌మెంట్ సొంత పార్టీ నేతలకే దొరకడం లేదని, ఇక విపక్షాలకు ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌కు పిలిచి నేతలు అందరికీ భోజనం పెడతామని సిఎం అసెంబ్లీలో అన్నారని తర్వాత దానిని విస్మరించారని పేర్కొన్నారు. కావల్సిన ఈవెంట్స్ తప్ప మిగిలిన ఈవెంట్స్ బాగా చేస్తున్నారని, నయిం ఘటన ఒక నెల, తెలుగు మహాసభలు ఒక నెల, అసెంబ్లీ పేరుతో ఒక నెల ఇలా ప్రచారం చేసుకోవడంలో ప్రభుత్వం ముందుందని ఆరోపించారు.