తెలంగాణ

అమరావతి నిర్మాణాన్ని స్విస్‌చాలెంజ్ పద్ధతి ద్వారా నిర్మించడం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్ధతిని ఆంధ్రప్రభుత్వం అనుసరించడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలంటూ ఆంధ్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వౌలిక సదుపాయాల అభివృద్ధి సాధన సంస్థ (ఏపిఐఇడి)లో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్విస్ పద్ధతిలో ఎంపికైన అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్ సెంబ్‌కార్ప్ కన్సార్టియం ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తూ ఏపి ప్రభుత్వం జారీ చేసిన జీవో అక్రమమని ప్రకటించాలని కోర్టును కోరారు. అమరావతిలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సిఆర్‌డిఏ ఆహ్వానించిన క్యాంపిటీటివ్ బిడ్స్‌ను, ఈ బిడ్స్‌కు సవరణలకు 2016లో చేసిన ప్రతిపాదనలపై సింగిల్ కోర్డు జడ్జి స్టే ఇచ్చిందని ఆయన హైకోర్టుకు తెలిపారు. అనంతరం సింగిల్ జడ్జి ఆదేశాలను ధర్మాసనం వద్ద ఏపి ప్రభుత్వం సవాలు చేసిందన్నారు. ఒరిజనల్ ప్రొపెంట్‌కు లోబడి కాంపిటీటివ్ బిడ్స్‌ను ఆహ్వానిస్తామని ధర్మాసనంకు తెలిపి అపీల్‌ను ఆంధ్రప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ఏపిఐఇడి చట్టాన్ని సవరించి , ఆ సంస్థ అధికారాలను తన వద్ద ఉంచుకుందన్నారు. సిఆర్‌డిఏ అధికారాలను కూడా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని, తనకు అనుకూలమైన సంస్థలకు నిర్మాణం పనులను అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సెంబ్‌కార్ప్ సంస్థపై కృష్ణపట్నం పోర్టు విషయంలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామన్నారు. సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చే విధంగా చేసేందుకు వీలుగా విజిలెన్స్ కమిషన్ నివేదికను వెల్లడించడం లేదన్నారు. బ్రెజిల్ దేశంలో ఒక ప్రాజెక్టు విషయమై కూడా ఇదే సంస్థ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నదన్నారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసంగా చేపట్టరాదని ఆయన కోర్టుకు తెలిపారు. రాజధాని అభివృద్ధిని స్విస్ చాలెంజ్ మోడ్ ద్వారా చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం చెల్లదని ప్రకటించాలని ఆయన హైకోర్టునను కోరారు.