సబ్ ఫీచర్

బలవన్మరణాలకు బాధ్యులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధునాతన సాంకేతికత, ప్రాచీన ఆస్తిక తాత్త్వికత సహజంగా ప్రపంచాన్ని, మానవ జీవనశైలిని ప్రభావితం చేస్తుంటాయి. పౌరాణిక, అనాగరిక యుగాల్లో చంపడం, చావడం పరిపాటి. కానీ, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వల్ల లేదా ఆథ్యాత్మిక జ్ఞానం వల్ల కానీ నేడు మానవాళి బతకడం, బతకనివ్వడం వంటి నైతిక విలువలను కూడా అనుసరించలేక పోతోంది. సమాజం, దేశాలు, మానవజాతి ఎంత ప్రగతి సాధిస్తున్నా శత్రు పాశవిక హింస, అమానుష హత్యాకాండలతో అట్టుడుకుతున్నాయి. విశ్వవ్యాప్తంగా మారణహోమం సృష్టించగల యుద్ధోన్మాదం సర్వత్రా పొంచి ఉంది. శతాబ్దాల మేధా పరిజ్ఞానంతో సృష్టించుకున్న నాగరికతను మానవ మేధస్సే ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపిస్తోంది. ప్రవక్తలు, శాస్తవ్రేత్తలు, మహాత్ముల సూచనలను మానవ కల్యాణానికి వినియోగించుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
అగ్రదేశాల సమాజాల్లో ‘గన్ కల్చర్’ పౌర విషసంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా పడగ విప్పుతోంది. అణ్వాయుధాలు సృష్టించే మృత్యు విధ్వంసానికి అగ్రరాజ్యాలు పోటాపోటీగా హూంకరిస్తున్నాయి. ప్రపంచం ఒక ‘గ్లోబల్ విలేజి’గా సామీప్యం సాధించడంతో సత్ఫలితాలు, దుష్పరిణామాల ప్రభావం అనుభవించక తప్పడం లేదు. మతవిశ్వాసం వ్ఢ్యౌంగా మారి ఉన్మాద స్థాయిలో జడలు విప్పి ఉగ్రవాదంగా బీభత్సం సృష్టిస్తోంది. సాంకేతికతా దుష్పరిణామాలు మతానికి బాసట కావడంతో మానవాళి మృత్యు పరిష్వంగంలో చిక్కుకుంటోంది.
ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం, పోషకాహార లోపం, అవిద్య, సామాజిక అనాచారాలు, అత్యాచారాలు, సంప్రదాయ సంకుచిత ధోరణులు అన్ని దేశాల్లో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఒకప్పడు అఖండ భారత్‌లో అంతర్భాగంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు మన సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తోంది. దేశ రక్షణ, భద్రత ఇపుడు భారత్‌కు పెను సవాళ్లుగా మారాయి. 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఉపాధి అవకాశాలు లభించక యువత తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతోంది. కొందరు మేధావులు ఇందుకు సహకరించడం దారుణం. దేశవ్యాప్తంగా నేర ప్రవృత్తి పెరుగుతోంది. పాలకులు విదేశీ పెట్టుబడుల కోసం నేల విడిచి సాము చేస్తున్నారు. రైతులు, పేదలు, మధ్య తరగతివారు, యువత నిరాశకు లోనవుతున్నారు. ఈ వర్గాలన్నీ ప్రభుత్వ సాయం కోసం నిరీక్షిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
నగరాల్లో సులభంగా డబ్బు సంపాందించేందుకు నేరాల వైపు ఎంతోమంది మొగ్గు చూపుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలకు అంతే లేకుండా పోతోంది. ఆర్థిక సమస్యలతో పిల్లలతో పాటు దంపతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవ వధువులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రమోన్మాదం, లైంగిక దాడులతో అమ్మాయిలు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. అంటు సాంకేతికత గానీ, ఇటు ఆథ్యాత్మిక గానీ ఆదుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా రైతుల ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఇక వివిధ కారణాలతో పౌర సమాజంలో జీవితం పట్ల పిరికితనం, తేలిక భావం పెరుగుతున్నాయి. సమస్యలపై పోరాడడం కంటే చావడమే నయం అన్న భావన పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలతో జీవితాలను ముగిస్తున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వం బాధ్యత వహించాలి. హైదరాబాద్ నగరంలో ఈ నెల ఆరంభంలోనే వారం రోజుల వ్యవధిలో 14 మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఈ విషమ పరిస్థితి నివారణకు పరిష్కార మార్గాలను అనే్వషించాలి.

- జయసూర్య 94406 64610