జాతీయ వార్తలు

కేంద్ర పథకాల ఫలాలు దక్కాలంటే బీజేపీకే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల, ఫిబ్రవరి 13: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు చేరాలంటే బీజేపీకే అధికారం అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రిపుర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. త్రిపురలో ఈ నెల 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఆదిత్యనాథ్ సోమవారం అగర్తల చేరుకున్నారు. త్రిపురలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం కేంద్ర పథకాలను ప్రజలకు అందించడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే కేంద్రంతో సఖ్యత ఏర్పడి సంక్షేమ పథకాలు పేదలకు చేరవేసే అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఏర్పడితే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ స్కీమ్, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన తదితర పథకాలను రాష్ట్రం సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నారు. త్రిపురలోని మాణిక్ సర్కార్ ప్రభుత్వం విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో ఎంతో వెనుకబడిందని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే బీజేపీకి ఓటేయడమొక్కడే ప్రజల ముందున్న పరిష్కారమని యోగి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బీజేపీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను అదుపుచేయడంతోపాటు ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, కేవలం పది నెలల్లో శాంతిభత్రలను పరిరక్షించామని, తద్వారా రాష్ట్రంలో కేంద్ర బలగాల వినియోగాన్ని తగ్గించగలిగామని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.