ఆంధ్రప్రదేశ్‌

మరో రెండు పారిశ్రామిక పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పడనున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించే దిశగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.66 కోట్ల విలువ చేసే ఐదు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించింది. ఆయా ప్రాజెక్టులకు కేంద్రం రూ.36.86 కోట్లు ఇస్తుంది. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంది. కొత్తగా పుడుతున్న ప్రతి 10 ఉద్యోగాల్లో 8 ఉద్యోగాలు ఎంఎస్‌ఎంఈ రంగంలోనే ఉండడం వల్ల, ప్రభుత్వం ఈ రంగంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఐదు ప్రాజెక్టుల్లో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో ఒక ఉమ్మడి సేవల కేంద్రం (సీఎఫ్‌సీ)ని కూడా ప్రభు త్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రం తిరుపతిలోని ముద్రణా రంగానికి సంబంధించిన యూనిట్లకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉద్యోగాల సృష్టిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీడీపీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిద్థార్ధ్ జైన్ అన్నారు. ఇందులో భాగంగా ఎంఎస్‌ఎంఈలను ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుచేసి అనుమతులిస్తారని చెప్పారు. ఆయా క్లస్టర్లలో ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుంది. అలాంటి క్లస్టర్ల అభివృద్ధికి, ఉన్నవాటి సౌకర్యాల మెరుగుదలకు మొత్తం రూ.66.06 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి సూత్రప్రాయ అంగీకారాన్ని పొందింది. ఈ అంగీకారంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు 36.86 కోట్లను కేంద్రం అందజేస్తుంది. చిత్తూరు, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఐదు ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. వీటిలో తిరుపతిలోని ప్రాజెక్టు ప్రింటింగ్ రంగానికి సంబంధించి సీఎస్పీ కాగా, విశాఖపట్నంలోని గాజువాకలోనూ, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలోనూ ఇప్పటికే ఉన్న పారిశ్రామిక పార్కుల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తారు. మరో రెండు ప్రాజెక్టుల్లో భాగంగా, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, చిత్తూరులోని గండ్రాజుపల్లిలో కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేస్తారు. ఇందుకు అవసరమైన భూమి ఇప్పటికే ఏపీఐఐసీ దగ్గర ఉంది. సదరు భూమిలో అవసరమైన పారిశ్రామిక వౌలిక సదుపాయాలను కల్పించి పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు సాయం చేస్తుంది.