Others

కోరకుండా ఉండడమే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఅర్జున॥
భగవద్గీత 4-9
భావం: ఓ అర్జునా! కల్మషం లేకుండా నన్ను ప్రేమించేవారు, ఆరాధించేవారు శరీర త్యాగం చేసిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా శాశ్వతమైన ధామమునే చేరతారు. ముక్తికావాలని, పుణ్యం కావాలని పూజలు చేయడం సరికాదు. ముక్తి, పుణ్యం అనేవి కోరికలు. కోరికలకు అతీతమైంది ప్రేమ. అందుకే శ్రీకృష్ణుడిని తులాభారం వేసే సమయంలో సత్యభామ అహంకారంతో తన ఒంటిపై ఉన్న ఆభరణాలన్నింటినీ త్రాసులో వేసినా కృష్ణుడి బరువుకు సమానం కాలేదు. అదే సమయంలో ఎలాంటి కల్మషంలేని మనస్సుతో, కృష్ణుడిపై ప్రేమతో రాధ తులసి దళాన్ని త్రాసులో వేయగానే కృష్ణుడివైపు ఉన్న త్రాసుతో సమానమైంది. అదీ నిర్మలమైన ప్రేమ. అలాంటి ప్రేమను మనమంతా మన మనస్సులో నింపుకోవాలి.