డైలీ సీరియల్

వ్యూహం-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘డాక్టర్‌గారు పెళ్లి చేసుకోలేదు. పేద పిల్లల్ని దగ్గరికి తీసి చదివిస్తూ వుంటారు. ఆయన సంపాదన అంతా అనాథ పిల్లలకే ఖర్చుపెడుతూ ఉంటారు. ఆయన దగ్గర్నుంచి ఆర్థిక సహాయం పొందిన వాళ్ళలో నేనూ వున్నాను.. ఒక బ్యాచ్ చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డా, మరొక బ్యాచ్ తయారవుతూ వుంటుంది.. ప్రొఫెసర్‌గారి తమ్ముడి కూతురు కేర్ టేకర్.. ఆ అమ్మాయి, అల్లుడూ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.... వాళ్ళిద్దరిని కూడా పెంచి పెద్ద చేసింది ప్రొఫెసర్‌గారే’’ చెప్పుకుపోయింది.
‘‘మా ఇంట్లో పెరిగిన కుర్రాడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యాడయ్యా! అతనితో ఏదన్నా పని వుంటే నాకు చెప్పు! నేనెప్పుడూ సచివాలయం వెళ్ళను.. నలుగురికి ఉపయోగపడే మంచి పనికైతే నా మద్దతు ఉంటుంది’’ అన్నాడు దయానందరావు.
అప్పుడు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది స్కందకు.
దయానందరావుగారిని అడిగి చూస్తే!
డిజిపి ట్రాన్స్‌ఫర్ తప్పదన్నాక తన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయా?
ఓ ప్రయత్నం చేసి చూద్దాం! అయితే అవుతుంది.. లేకపోతే లేదు!
లోహితను తీసుకుని దయానందరావుగారి ఇంటికి వెళ్ళాడు.
వాళ్ళు అక్కడకు చేరుకునేసరికి ఆయన ఫ్లోర్‌మీద కూర్చుని పిల్లలకు సైన్సు పాఠాలు చెబుతున్నాడు. ఆసక్తికరంగా వింటున్నారు చుట్టూ కూర్చున్న పిల్లలు. రాష్ట్రంలో ప్రముఖుడు ఆయన. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఎన్నో సంవత్సరాలు చేశాడు. ఆయన రాసిన గ్రంథాలు మెడికోస్ చదువుతూ వుంటారు. సత్కారాలకు, ఆడంబరాలకు దూరంగా వుండే వ్యక్తి అని ఎన్నో మ్యాగజైన్స్‌లో ఆయన మీద ఆర్టికల్స్ వచ్చాయి. క్రిటికల్ ఆపరేషన్స్‌కు సంబంధించిన విషయాలను ఇప్పటికీ ప్రముఖ వైద్యులు సంప్రదిస్తూనే వుంటారు.
అంత గొప్ప ప్రొఫెసర్ చిన్న పిల్లలకు పాఠాలు చెప్పడమేమిటి?
ఆ సింప్లిసిటీకి ఆశ్చర్యపోయింది లోహిత.
ఆయన ప్రక్కనే ఫ్లోర్‌మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ.
పిల్లల్ని లోపల గదిలోకి వెళ్లి చదువుకోమని చెప్పాడు పెద్దాయన.
‘‘ఏం పని మీద వచ్చారు?’’
గుడ్ సమారిటన్ హాస్పిటల్లో జరుగుతున్న కిడ్నీ, ఇతర అవయవాల మార్పిడి కుంభకోణం గూర్చి, అరిఫ్ మనుషుల ఆగడాల గూర్చి, తన చెల్లెలు మీద అఘాయిత్య ప్రయత్నం, తండ్రి చెయ్యి నరకడం, ఇద్దరు డాక్టర్ల హత్యల గూర్చి పూసగుచ్చినట్లు చెప్పింది డాక్టర్ లోహిత.
తను జరుపుతున్న ఇనె్వస్టిగేషన్ వివరాలు క్లుప్తంగా చెప్పాడు స్కంద.
‘‘నెల రోజుల్లో దోషులను కటకటాల వెనక్కు తోసే స్టేజీకి చేరుకున్నాం! అరిఫ్ పైనుంచి వత్తిడి తెచ్చి నన్ను ట్రాన్స్‌ఫర్ చేయించాడు’’.
స్కందను పూర్తిగా చెప్పనివ్వకుండానే ‘‘నీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించాలి! అంతేగా!’’ అన్నాడు దయానందరావు.
జేబులో నుంచి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీ ఆయనకు ఇచ్చాడు స్కంద.
‘‘మీరు వెళ్ళండి.. నా ప్రయత్నం నేను చేస్తాను’’ అన్నాడు ఆయన.
***
సచివాలయం ‘బి’ బ్లాక్‌లో హోమ్ డిపార్టుమెంటు వుంది.
హోమ్ మినిస్టర్ ఛాంబరు ఎక్కడ వుందో కనుక్కుని మంత్రిగారి పేషీలోకి వెళ్లాడు.
మంత్రిగారి పి.యస్ ఎదురుగా పదిమంది కూర్చున్నారు. అందరూ రాజకీయ నాయకులే! పోలీసు అధికారులు కూడా ఒకరిద్దరు వున్నారు. గుళ్ళో పూజారిని ప్రసన్నం చేసుకుంటే దేవుడి కృప దొరుకుతుంది.
ఆ ప్రయత్నాల్లో వున్నారు వాళ్ళు
కూర్చోవడానికి కుర్చీ ఖాళీగా కన్పించలేదు. పది నిముషాలు పిఎస్ ఎదురుగా నిలబడ్డాడు దయానందరావు.
పియస్ దృష్టి ఆయనమీద పడింది. ‘ఏం పనిమీద వచ్చారు?’ అడిగాడు
‘‘మినిస్టర్‌గార్ని కలవాలి’.
‘‘అందరూ హోమ్‌మినిస్టర్‌గార్ని కలవడానికే వచ్చారు. తొందరపడితే ఎలా?’’ అన్నాడతను దర్పంగా కుర్చీలో వెనక్కువాలి.
విజిటింగ్ కార్డు పిఎస్‌కు ఇచ్చాడు.
తన క్వాలిఫికేషన్స్, చేసిన ఉద్యోగం, వయస్సును చూసన్నా కొంత గౌరవిస్తాడేమోనని ఆశించాడు.
‘‘విజిటర్స్ లాంజ్‌లో కూర్చోండి.. పిలుస్తాను’’ అన్నాడతను.
గదిలో నుంచి దయానందరావు వెళ్లిపోయాక విజిటింగ్‌కార్డు డ్రాయర్లో పడేశాడు.
‘రిటైరైన ప్రొఫెసర్ కూడా మంత్రిగారిని కలవడానికి వస్తే ఎలా? ఎంతమందితో మాట్లాడుతాడు మంత్రిగారు. ప్రాక్టికల్ డిఫికల్టీ ఆలోచించరు’’ విసుక్కున్నాడు మంత్రిగారి పి.ఎస్.
గంటసేపు విజిటర్స్ లాంజ్‌లో కూర్చున్న పిలుపు రాలేదు.
దయానందరావు లేచి మెల్లగా నడుస్తూ మంత్రిగారి ఛాంబర్ దగ్గరకు వచ్చాడు. తలుపు తోసుకుని లోపలికి వెళ్లబోతుంటే సెక్యూరిటీగార్డులు ఆయన్ను వెనక్కు నెట్టారు.
ఆయన తూలి కిందపడ్డాడు.
ఐపియస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు అటెండ్ కావడానికి అప్పుడే బయటకు వచ్చిన హోమ్ మినిస్టర్ హర్షవర్థన్ కిందపడిపోయిన దయానందరావును చూశాడు.

అలపర్తి రామకృష్ణ