గుంటూరు

ధీరోదాత్తుడు ఛత్రపతి శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 19: వేద, తపో, ధర్మభూమి అయిన మన భారతదేశాన్ని, విశ్వజనీనమైన హైందవ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తన సర్వశక్తులూ ఒడ్డిన ఛత్రపతి శివాజీ ధీరోదాత్త గుణ సంపన్నుడని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. సోమవారం ఉదయం నగరంలోని కొరిటెపాడు పార్కు ఆవరణలో ఛత్రపతి శివాజీ సేవాసమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శివాజీ 391వ జయంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సేవాసమితి అధ్యక్షుడు జె సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సిందే లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఉత్సవ ప్రారంభంలో శివాజీ విగ్రహానికి రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఐజీ సిహెచ్ ఏసురత్నం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ డి శ్రీనివాస్, ఎసిబి ఎఎస్‌పి జె భాస్కరరావు, మాజీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, కళ్లం విద్యాసంస్థల అధినేత కళ్లం హరనాథరెడ్డి, మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు, చిరుమామిళ్ల గోపీకృష్ణ, కన్న విద్యాసంస్థల అధినేత కన్న మాస్టారు, ప్రొఫెసర్ షిండే, సిహెచ్ హరీష్, ఎ ఆదిశేషు తదితరులు పుష్పమాలలు అర్పించి శివాజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి డిఐజి ఏసురత్నం మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డల్లో శివాజీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్నారు. నేటి యువత శివాజీ ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉత్సవంలో భాగంగా అక్షర విద్యాలయం, నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 200 మందికి పుస్తకాలను అతిథులు పంపిణీ చేశారు.

మున్సిపల్ అంచనా, సవరణ బడ్జెట్‌లకు ఆమోదం
మంగళగిరి, ఫిబ్రవరి 19: మంగళగిరి పురపాలక సంఘ 2017 - 18 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు, 2018 - 19 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షత వహించారు. 2017- 18 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలకు ప్రారంభ నిల్వ కింద 11,47,36,000 రూపాయలు చూపి సాధారణ, మూలధనపు మొత్తం జమలు 20,04,07,000 రూపాయలుగా అంచనా వేశారు. సాధారణ, మూలధనపు ఖర్చులు 22,24,48,500 రూపాయలుగా అంచనా వేసి ముగింపు నిల్వగా 9,26,94,500 రూపాయలుగా చూపారు. 2018-19 సంవత్సరపు బడ్జెట్ అంచనాలకు ప్రారంభ నిల్వ కింద 9,26,94,500 రూపాయలుగా తీసుకుని సాధారణ, మూలధనపు ఖాతా మొత్తం జమలు 24,92,00,000 రూపాయలుగా అంచనా వేసి సాధారణ, మూలధనపు ఖర్చుల కింద 31,24,61,600 రూపాయలుగా అంచనా వేశారు. ముగింపు నిల్వగా 2,94,32,000 రూపాయలను చూపారు. అంచనా బడ్జెట్‌లో ఆస్తిపన్ను 2కోట్ల 70 లక్షలు గాను, ఖాళీ స్థలాల పన్ను 45 లక్షలు, వినోదపు పన్ను 25 లక్షల, స్టాంపు డ్యూటీ 3 కోట్లు రాగలదని అంచనా వేశారు. చైర్‌పర్సన్, కౌన్సిల్ సభ్యుల గౌరవ వేతనాలు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు చూపారు. పురపాలక సంఘం వినియోగించే అద్దె వాహనాల ఖర్చు 8.50 లక్షల రూపాయలుగా అంచనావేసి చూపారు.
పేదలకు సొంతిళ్ల నిర్మాణం జరిగేనా ?
పట్టణంలో పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తామని 2015 నుంచి చెబుతూ దరఖాస్తులు తీసుకున్నారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని, అసలు ఇళ్ల నిర్మాణం జరుగుతుందా లేదా అని సీపీఐ సభ్యుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు ప్రశ్నించారు. చైర్మన్ చిరంజీవి స్పందిస్తూ పట్టణంలోని ఆటో నగర్‌వద్ద 14.70 ఎకరాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, దరఖాస్తులు 5 వేలకు పైగా వచ్చినందున మరో 40 ఎకరాల స్థలం కేటాయించాలిన జిల్లా కలెక్టర్‌ను కోరగా సిఆర్‌డిఎ అధికారులతో మాట్లాడారని, విదేశీ పర్యటనలో ఉన్న కలెక్టర్ జిల్లాకు చేరుకోగానే కలిసి మాట్లాడదామని, ఉడా కాలనీలో 40 ఎకరాలు ఇచ్చేందుకు సిఆర్‌డిఎ కూడా అంగీకారం తెలిపిందని, అక్కడ స్థలం కేటాయించగానే రత్నాలచెరువు వద్ద ఉన్న స్థలాన్ని ఐటిపార్కుకు కేటాయించేందుకు చర్యలు తీసుకుందామని అన్నారు. గతంలో జాబితానుంచి తొలగించిన అర్హుల పేర్లను తిరిగి చేర్చాలని అధికారులను కోరామని చైర్మన్ చిరంజీవి పేర్కొన్నారు. 14.70 ఎకరాల్లో శంకుస్థాపన జరగక పోవడంతో అక్కడ ఇళ్లకు బదులు ఐటి కంపెనీలు పెడతారని ప్రజలు అపోహ పడుతున్నారని మునగపాటి వెంకటేశ్వరరావు అన్నారు. కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎటువంటి అపోహలు అవసరం లేదని ఒక్కో బ్లాకులో 32 ఇళ్లు ఉండే విధంగా 54 బ్లాకులు అంటే 1728 గృహాలు నిర్మించడం జరుగుతుందని, మిగతా వారికి ఉడా కాలనీలో నిర్మించడం జరుగుతుందన్నారు. డంపింగ్‌యార్డుకు కూడా స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు చైర్మన్ చిరంజీవి వెల్లడించారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకుంటే పట్టణంలో అభివృద్ధే ఉండదని, మరో ఏడాదిన్నరలో ఈ కౌన్సిల్ గడువు ముగుస్తుందని, ప్రజల కిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక పోయామని సీపీఎం సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. గౌతమబుద్ధ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం 23 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ఆర్థిక శాఖ అనుమతిస్తే నిధులు విడుదల అవుతాయని చైర్మన్ చిరంజీవి పేర్కొన్నారు. పట్టణంలో విచ్చల విడిగా ఆక్రమణలు ఉన్నప్పటికీ అధికారులు పన్నులు వేయడం లేదని, మెయిన్ బజార్‌లో ఒక్కో వ్యాపారి 10 అడుగులు ముందుకు వచ్చారని, వచ్చే నెల 1వ తేదీన రధోత్సవం ఉన్నందున ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు పూనుకోవాలని మునగపాటి వెంకటేశ్వరరావు కోరారు.