కృష్ణ

హోంగార్డు డ్రైవర్ పోస్టుల నియామకానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 19: పోలీసు శాఖతో సత్సమానంగా కొనసాగుతున్న హోంగార్డు విభాగం ద్వారా జిల్లాలో ఖాళీగా ఉన్న 18 డ్రైవర్ పోస్టుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మే రకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. పోలీసు శాఖ వాహనాలతో పాటు డిసాస్టర్ రె స్పాన్స్, అగ్నిమాపక శాఖలో డెప్యుటేషన్‌పై హోం గార్డులను డ్రైవర్ల నియమించేందుకు గాను ఈ నెల 21వతేదీ నుండి 28వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు విలువ రూ.25లతో ఎస్‌బీఐలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కృష్ణా పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఎస్పీ కార్యాలయంలో అందచేయాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2018 ఫిబ్రవరి 21వతేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఏడవ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు, రెండు సంవత్సరాలు డ్రైవింగ్‌లో అనుభవం కలిగి ఉండాలన్నారు. నియామక కమిటీ నిర్ణయించిన డ్రైవింగ్ నైపుణ్యతా పరీక్షా విధానం, వెహికల్ మెయింటినెన్స్ అవగాహనా పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం
నూజివీడు, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ప్రత్యేక హో దా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ద్వంద్వ వైఖరితో ప్రజలను మో సం చేస్తున్నాయని ఆరోపించారు. మోసపోయేందు కు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని, వచ్చే ఎన్నికలలో ఈరెండు పార్టీలో ప్రజాగ్రహంలో కొట్టుకుపోతాయని జోస్యం చెప్పారు. స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షను సోమవారం సాయంత్రం రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అయిదు సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటిస్తే, రాజ్యసభలో అయిదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని నేటి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు కోరారని అన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి పలు కేంద్ర సంస్థలను కేటాయించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో తిరుపతిలో మోదీ, చంద్రబాబులు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక, మాట మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మోదీ పాలన ప్రారంభమైన నాటి నుండి రాష్ట్రానికి ప్రత్యేక హో దా కోసం కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా, పలు పర్యాయాలు ఆందోళన చేసిందని ఆయన వివరించారు. ప్రత్యేక హో దా కోసం ఆందోళన చే స్తుంటే అధికారంలో ఉ న్న టీడీపీ, బీజేపిలు అవహేళన చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించేందుకు పీసీసీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్షలు చేపట్టామని, మార్చి 2,3 తేదీల్లో జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని, 6,7,8 తేదీలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసి, పార్లమెంట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. భారీ స్థాయిలో ఆందోళన చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోతే వచ్చే ఎన్నికలలో(మిగతా 6 లో) రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని, తొలిసంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్, కేంద్ర మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అన్నిపార్టీలు సహాకరిస్తే పాపమంతా కాంగ్రెస్‌పై పడిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాపభారాన్ని మోస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ హోదా సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు విమర్శించే స్ధాయి టీడీపీ నేతలకు లేదని, మంత్రి కొల్లు రవీంద్ర స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి అయిదు సంవత్సరాల ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన ఏడు జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి 24,350 కోట్ల రూపాయలతో పాటు అయిదు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు, కేంద్ర సంస్ధలను కేటాయించిందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదని, కామధేనువు లాంటి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మస్తాన్ వలీ, బీడీ రవికుమార్, పాతూరి రవి, రాజీవ్త్రన్, పరిమి సాగర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
(19 యంటియం 3.జెపిజి) టెట్ నిర్వహణపై సూచనలు చేస్తున్న కలెక్టర్ లక్ష్మీకాంతం
వివాదాలకు తావు లేకుండా ‘టెట్’ నిర్వహించండి
* కలెక్టర్ బి లక్ష్మీకాంతం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 19: ఈ నెల 21వతేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. టెట్ నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీసు వంటి కేసులు నమోదు కాకుండా చూడాలన్నారు. జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 50వేల 184 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు ప్రతి రెండు పరీక్షా కేంద్రాలకు ఒక జిల్లా అధికారిని పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జెసీ విజయకృష్ణన్, డీఆర్‌ఓ అంబేద్కర్, ముడ వీసీ విల్సన్ బాబు, డీఇఓ ఎంవి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.