ఐడియా

ఇంటిపేరు మార్చిన జిలేబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంలోనో, పాండిత్యంలోనో, సాహిత్యంలోనో నటనలోనో తనదైన ప్రత్యేకత సంతరించుకుని తన పేరుకన్నా ముందుగా వారి ఇంటిపేరోవారి రచన పేరో వారిపేరుకు ముందుగా ఉచ్చరించే ప్రాచుర్యం పొందిన సందర్భాలు మనకు సాధారణమే.కాని పల్లెటూరులోని చిరు హోటల్‌లో తయారయ్యే జిలేబి వ్యాపారమే ఆయన ఇంటిపేరును మార్చివేసిందంటే ఆ వంటకానికి ప్రజల్లో ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పకనే తెలుస్తుంది.
సంతమాగులూరులో 50 ఏళ్ల క్రితం వీధి అరుగుపై అర్వపల్లి వారు ప్రారంభించిన జిలేబి వ్యాపారం నేడు మూడంతస్తుల భవనంలో నడుస్తుడటం వ్యాపారాభివృద్ధికి నిదర్శనమైతే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల పేర్లకు ముందు జిలేబి అని చేరిస్తేనే గాని వారి చిరునామా తెలిసే పరస్థితికి వచ్చిందంటే వారి వంటకానికి ప్రజల్లో ఎంతటి ప్రాచుర్యం ఉందో చెప్పవచ్చు.
మండల కేంద్రమైన సంతమాగులూరులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అర్వపల్లి వెంకటేశ్వర్లు చిన్నతనం నుంచి బేల్దారి పనులు చేసేవాడు. పెళ్లయిన తరువాత బేల్దారి కూలి పనులతో ఇల్లు జరగడం కష్టమైంది. అప్పడే తమ కులవృత్తి వ్యాపారం చేయాలని భార్య సూచన మేరకు గడ్డం వెంకటరెడ్డి ఇంటి ముందు వీధి అరుగుపై చిన్న గంపలో జిలేబి వంటకంతో వ్యాపారం ప్రారంభించారు. వారి జిలేబి వంటకం నాణ్యతతో కూడి రుచికరంగా ఉండటంతో సంతమాగులూరుతోపాటు పరిసర ప్రాంతాలవారు కూడా వివాహాది శుభకార్యాలకు ప్రత్యేకంగా సంతమాగులూరు జిలేబి వడించేవారు. ఈ నేపధ్యంలో జిలేబి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది వీధివ్యాపారం కాస్తా పదేళ్లకు మూడంతస్తుల సొంత భవనంలోకి మారింది. వ్యాపారాభివృద్ధితో పాటు అర్వపల్లి వెంకటేశ్వర్లుతో పాటు కుటుంబ సభ్యులనందరిని ప్రజలు జిలేబి వెంకటేశ్వర్లు, జిలేబి ప్రసాద్, జిలేబి రాము అని పిలవడం అలవాటైపోయింది. దీంతో వారి ఇంటిపేరు కాస్త జిలేబిగా మారిపోయింది. ప్రస్తుతం వారి కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. వ్యాపారం ప్రారంభించిన కుటుంబ పెద్ద వెంకటేశ్వర్లు ఐదేళ్లక్రితం కన్నుమూశారు. అయినా ఇద్దరు కుమారులతో వెంకటేశ్వర్లు ధర్మపత్ని రాజేశ్వరమ్మ తమకు అన్నంపెట్టిన జిలేబి వ్యాపారాన్ని కొనసాగించాలనే సంకల్పంతో కుమారులతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒక కుటుంబం జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ఇంటిపేరునే ‘జిలేబి’గా మార్చిన ఆ వంటకం మధురాతిమధురం..

- బి కృష్ణారెడ్డి