నమస్తే హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోహర్ చిమ్మని దర్శకత్వంలో పి.సి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న పక్కా కమర్షియల్ యూత్ ఎంటర్‌టైనర్ తెలంగాణ సినిమా ‘నమస్తే హైదరాబాద్’. ఈ చిత్రం ద్వారా కొత్త గాయనీ గాయకులను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో సంగీత దర్శకుడు ప్రదీప్ చంద్ర సారథ్యంలో రెండు రోజులపాటు నూతన గాయనీ గాయకుల ఆడిషన్ కార్యక్రమాన్ని ఫిలింనగర్‌లోని ఓ స్టూడియోలోనిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ ఎంప్లారుూస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమారస్వామి చిలగాని, మహిళా అధ్యక్షురాలు, కోశాధికారి నిర్మల ఫేడర్ ప్రారంభించి ఆడిషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంపత్‌కుమారస్వామి చిలగాని మాట్లాడుతూ- ‘తెలంగాణ దర్శకుడు మనోహర్ చిమ్మని రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులతో పాటు, నూతన గాయనీ గాయకులను కూడా పరిచయం చేస్తుండటం నిజంగా అభినందనీయం. మనోహర్ చిమ్మని రూపొందిస్తున్న ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలి’ అన్నారు. దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ -‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక తెలంగాణ దర్శకుడిగా నేను రూపొందిస్తున్న పూర్తి స్థాయి పక్కా తెలంగాణ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇది. సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది. ఎంతో మందిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం నేపథ్యంగా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం తెలంగాణ నుంచి మరికొంత మంది కొత్త గాయనీ గాయకులను కూడా పరిచయం చేయాలని భావించి ఈ ఆడిషన్ నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు. సంగీత దర్శకుడు ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ -‘తెలంగాణ యువతలో మంచి సంగీత జ్ఞానం ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు’ అని పేర్కొన్నారు. నూతన నటీనటులు, సీనియర్ సహ నటులతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహం: వీరేంద్రలలిత్, నిర్మాణం: ప్రదీప్ చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మనోహర్ చిమ్మని.