సబ్ ఫీచర్

దీపాలు పుస్తకాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పుస్తకాలనే దీపాల వెలుగులోనే - మనోమాలిన్యమనే చీకటి తొలుగుతుంది’’ అని మన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు, హస్త్భూషణమనదగిన పుస్తకం విలువ అక్షరాలలో నిక్షిప్తం చేయాల్సినంత గొప్పది. పుస్తక పఠనం అనేది ఆరోగ్యకరమైన ఒక మంచి అలవాటు. ఆ అలవాటు ద్వారానే మన ఆలోచనల పరిధి పెరుగుతుంది. ‘అభ్యాసము కూసు విద్య’ అనే నానుడి అక్షరసత్యమై, మన భాషాభివృద్ధికి, భావజాల విస్తృతికి ఇతోధికంగా తోడ్పడుతుంది. అయితే ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో, నెలకొన్న పోటీతత్వంతో నేటి విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల చదువుకే పరిమితమైపోతున్నారు. పుస్తకంటే వారి దృష్టిలో పాఠ్యపుస్తకం మాత్రమేనన్న భావన కలిగించేటట్లున్న నేటి విద్యా విధానంలో తదితర పుస్తకాల కలిగించే ప్రేరణ విలువ మరుగున పడుతోంది. తత్కారణంగా వారి మనోవికాసం- జ్ఞానాభివృద్ధి అనేవి మాటలకే పరిమితమై- చేతలలో చైతన్య రహితం అవుతున్నాయి. అది ఒక పార్శ్యం కాగా- సృజన కొరవడిన వారి ఆలోచనలు సృజనాత్మకతకు సుదూరమై బట్టీయం చదువులనే బావిలో కప్పలుగా ఎదుగుతున్నాయి. నేటి యువతీ యువకులకు సాహిత్యమనే సారస్వత సంపద ఎందుకూ కొరగాని జడ పదార్థంలా కనిపించడానికి గల మూల కారణం కూడా ఆ సృజన లోపమే!
మొక్కై వంగనిది మానై వంగునా? అనే తీరులో నేటి బాలల పరిస్థితి కూడా వీడియో ఆటలకు కార్టూన్ చిత్రాలకూ అలవాటుపడి- యాంత్రిక జీవన ఒరవడిలో అంతర్భాగమైపోయాయి. ప్రస్తుత అంతర్జాల శకంలో ‘పుస్తక పఠనం’ అనే మాట గగన కుసుమమై మతిమాలి గతి తప్పుతున్నది. ముఖ్యంగా ఎదిగే వయసులో అవసరపడే బాలల సాహిత్యం కొరత మెండుగా నెలకొన్న నేటి సామాజిక జీవన స్థితిలో పునాది లేని భవన నిర్మాణంలా తయారైంది నేటి పిల్లల పఠనాశక్తి! అరటిపండు ఒలిచి నోట్లోకి అందించినంత నేర్పుతో, తేలిగ్గా విషయాన్ని విశదపరిచే నీతి శతకాలు, పంచతంత్ర కథలు లాంటి జీవన వేదాలు ఈనాడు పిల్లలకు అందుబాటులోఉండాలి.
అపుడే వారుపూవుల్లా వికసించగల్గుతారు.

- ఎమ్. బి. మూర్తి