రాష్ట్రీయం

దేశవ్యాప్తంగా సిసిఇ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. పరీక్షల సంస్కరణలపై గత కొద్ది నెలలుగా లోతైన అధ్యయనం చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ అధ్యక్షతన 8మంది విద్యా నిపుణలతో దీనిపై కమిటీని నియమించింది. కమిటీ కామన్ కోర్ కరిక్యులమ్, సిలబస్ సబ్జెక్టు కోడ్‌లను నిర్ధారిస్తుంది. ఇందుకోసం ఈనెల 29న కమిటీ సమావేశం కానుంది. కమిటీలో జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డు చైర్మన్ జహూర్ అహ్మద్ చాట్, మహారాష్ట్ర బోర్డు చైర్మన్ గంగాధర్ మహమానే, నాగాలాండ్ బోర్డు చైర్మన్ అసనో సెకోస్, ఐసిఎస్‌ఇ బోర్డు చైర్మన్ డాక్టర్ జి ఇమాన్యుల్, ఎన్‌సిఇఆర్‌టి ఆర్‌ఎంఎస్‌ఎ హెడ్ ప్రొఫెసర్ రంజన్ అరోరా, మిజోరాం డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డేవిడ్ లాలవాంకిమా, సిబిఎస్‌ఇ అదనపు సంచాలకురాలు సుగంద్ శర్మ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.