రంగారెడ్డి

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఫిబ్రవరి 22: గ్రామాల్లో వౌలిక సమస్యలన్నింటిని పరిష్కరించినపుడే అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్‌లో గురువారం ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సంగాయిపల్లి గ్రామానికి సీసీ రోడ్లు, రాంపూర్ గ్రామంలోని ముదిరాజు సంఘం భవన నిర్మాణానికి నిధులను మంజురు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో రాంపూర్ గ్రామానికి చెందిన నేతలు రాములు, కృష్ణ, మహేష్, శ్రీరాములు, నిరంజన్ చేరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సర్పంచ్ మణెమ్మ, ఎంపీటీసీ వెంకటయ్య, శ్రీనివాస చారి, నాయకులు శ్రీనివాస చారి, హరి, జంగయ్య, ఆంజనేయులు, తిరుపతి రెడ్డి, వెంకట రామిరెడ్డి, అజీమ్, రవీందర్ యాదవ్, సుధాకర్ రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు వెంకటమ్మ పాల్గొన్నారు.