రంగారెడ్డి

యుద్ధప్రాతిపదికన ఆధార్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 22: రైతులకు మార్చి 11 నుంచి పట్టాదార్ పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉన్నందున రైతుల ఆధార్ సీడింగ్ ప్రక్రియను యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో పరిశీలన, ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. శామీర్‌పేట్, కీసర, మేడ్చల్ మండలాల్లో వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మట్టి, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసులు నమోదు చేయాలని తెలిపారు. గ్రామాల్లోని అక్రమ లేఔట్‌లపై దృష్టి సారించాలని వివిధ పత్రికల్లో వచ్చిన అథనాలపై అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌ల్లో ఉన్న కేసులకు కౌంటర్లు దాఖలు చేసి ప్రభుత్వ భూములను రక్షించాలని ఆదేశించారు. కీసర డివిజన్‌లో 71 కేసులు, మల్కాజ్‌గిరి డివిజన్‌లో 29 కేసులు ఉన్నాయని అన్నారు. రెవెన్యూ కోర్టులకు సంబంధించి కీసర డివిజన్‌లో 66, మల్కాజ్‌గిరి డివిజన్‌లో 50 కేసులు పరిష్కరించాల్సి ఉందని పేర్కొన్నారు. వారం రోజుల్లో కేసులు పరిష్కరించాలని సూచించారు. కల్యాణలక్ష్మీ దరాఖాస్తులు త్వరితగతిన పరిష్కరించి, చెక్కులను ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని అన్నారు. కీసర డివిజన్‌లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మీ-సేవా దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, కీసర డివిజన్‌లో ఎక్కువ మొత్తంలో పెండింగ్‌ల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని, ఎన్‌ఓసీల జారీ విషయంలో ఆలస్యం చేయరాదని, భూముల సర్వే ప్రక్రియ వేగవంతం చేయలని సూచించారు. జేసీ ధర్మారెడ్డి, లా అధికారి విజయ కుమారి, మల్కాజ్‌గరి ఆర్డీఓ మధుసూధన్ పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ అశోక్.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ 115235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. విద్యార్ధులు 8.45గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేసుకోవాలని ఒక్క నిమిషం లేటైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థుల కోసం అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపునున్నట్లు తెలిపారు. 20 పరీక్షా కేంద్రాలకు ఒకటి చొప్పున ఫ్లైయింగ్ స్కాడ్, ఐదు సిట్టింగ్ స్కాడ్‌లు, పరీక్షల నిర్వహణ కోసం 3450 మంది విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ సిట్టింగ్ స్కాడ్‌లు, 144 సెక్షన్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్ ప్రభాకర్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఈ.వెంకటేశం పాల్గొన్నారు.