రంగారెడ్డి

రైతులకు న్యాయం చేస్తాం: జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, ఫిబ్రవరి 22: మండల పరిధిలోని చందనవెళ్లి రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులకు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ అబ్నార్ తెలిపారు. గురువారం చందనవెళ్లి గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులతో మాట్లాడుతూ.. చందనవెళ్లి గ్రామానికి చెందిన రైతుల ప్రభుత్వ భుములను స్వాధీనం చేసుకోవాడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎకరాకు రూ.9 లక్షలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందని తెలిపారు. రైతులు సాగు చేస్తున్న భూమి సాగుపత్రం పై ఓప్పుకున్నట్టు సంతకం చేసి తహశీల్దార్ కార్యాలయంలో అందజేస్తే 15 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. చందనవెళ్లిలో 1200 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది, అందులో ఆరువంద ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోని టీఎస్‌ఐసీసీ సంస్థకు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎకరాకు రూ. 10లక్షలు ఇవ్వాలి
- ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి డిమాండ్
మండల పరిధిలోని చందనవెళ్లికి చెందిన 179 మంది రైతులకు ఎకరాకు రూ. 10లక్షలు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా పంటలు పండించుకోని జీవనం సాగిస్తున్నారు. చందనవెళ్లి గ్రామానికి చెందిన యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వన్ని కోరారు. కార్యక్రమంలో అధికారులు ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతుసంఘం సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అంతమ్మ, ఎంపీటీసీ నీరజ పాల్గొన్నారు.