సంపాదకీయం

స్నేహగీతిలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడాతో మనదేశానికి కొనసాగుతున్న స్నేహ సంబంధాలను అపహరించడానికి ‘‘ఖలిస్తాన్’’ బీభత్స భూతం మరోసారి విఫలయత్నం చేసింది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మనదేశంలో వారం రోజులుగా సకుటుంబంగా జరుపుతున్న పర్యటన సందర్భంగా ఈ తథాకథిత- సోకాల్డ్- ‘‘ఖలిస్థాన్’’ తోడేలు తన తలను మరోసారి నిక్కపెట్టడానికి యత్నించింది. ‘‘ఖలిస్తాన్’’ బీభత్సకాండ పంజాబ్‌ను కల్లోల పరచడం క్రీస్తు శకం 1980వ దశకం నాటి చరిత్ర. ‘‘పంజాబ్‌ను దేశం నుండి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడం’’ లక్ష్యం. దాదాపు దశాబ్దుపాటు కొనసాగిన ఈ బీభత్సకాండను పంజాబ్ ప్రజలు అభిశంసించారు. దేశ ప్రజలు అభిశంసించారు. జర్నీల్ సింగ్ భింద్రన్‌వాలే అనే పేరు మోసిన దేశద్రోహ బీభత్సకారుడిని 1984లో మన సైనికులు వధించడంతో విచ్ఛిన్నవాదుల నడుం విరిగిపోయింది. ‘ఖలిస్తాన్’ బీభత్సం క్రమంగా సమసిపోవడానికి మన సైనికులు 1984లో జరిపిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సాయుధ చికిత్స దోహదం చేసింది. అయినప్పటికీ భింద్రన్‌వాలే అనుచరులు విదేశాలలో చేరి మన దేశానికి వ్యతిరేకంగా కొనే్నళ్లపాటు బీభత్సకాండను కొనసాగించారు! ఈ బీభత్సకాండలో భాగంగానే జర్నల్ సింగ్ భింద్రన్‌వాలే సమీప బంధువైన అమీర్‌సింగ్ అనేవాడు ‘అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్య’ను స్థాపించాడు. ఈ ‘అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్య’- ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్- ఐఎస్‌వైఎఫ్-, మరికొన్ని బీభత్స సంస్థల కుట్ర కారణంగానే 1985లో మన కనిష్క విమానం అట్లాంటిక్ సముద్ర గగనతలంలో పేలిపోయి సముద్ర జలాలలో కూలిపోయింది. మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు బలై పోవడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన బీభత్స ఘటన! ఈ ‘అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్య’ కెనడాలో ఇపుడు నిషిద్ధ సంస్థ ‘‘ఖలిస్థాన్’’ విచ్ఛిన్నకారులను కాని, ఇతరేతర భారత వ్యతిరేక ఉగ్రవాదులను కాని బీభత్సకారులనుకాని తమ దేశం సమర్ధించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుత పర్యటన సందర్భంగా పదేపదే స్పష్టం చేశాడు. శుక్రవారం కొత్త ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన సందర్భంగా పునరుద్ఘాటించారు. అయినప్పటికీ నిషిద్ధ ‘అంతర్జాతీయ సిక్కు యువజన సమాఖ్య’ సభ్యుడు, గతంలో అనేక బీభత్స ఘటనలు జరిపిన జస్వాల్ అత్వాల్ ట్రూడో బృందంలో కలిసిపోయి నిర్భయంగా మనదేశానికి రావడం ద్వైపాక్షిక స్నేహగీతంలో ధ్వనించిన ఘోరమైన అపశ్రుతి!
ఈ జస్వాల్ అత్వాల్ అన్న ధ్రువపడిన నేరస్థుడు మనదేశం నుండి వెళ్లి కెనడాలో స్థిరపడిన కుటుంబానికి చెందినవాడు. కెనడా పౌరుడైన ఈ బీభత్సకారుడు 1986లో పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్దూను చంపడానికి విఫలయత్నం చేశాడు. కెనడాలోని వాంకూవర్ ద్వీపంలో వ్యక్తిగత పర్యటన జరుపుతుండిన మల్కియాత్ సింగ్ సిద్దూపై అత్వాల్, మరో ముగ్గురు ‘ఖలిస్తాన్’ బీభత్సకారులు కాల్పులు జరిపి హత్య చేయయత్నించారు. ఈ హత్యా ప్రయత్న నేరం బీభత్సకాండలో భాగమని నిర్ధారించిన వాంకూవర్ న్యాయ స్థానం అత్వాల్‌కు మిగిలిన నేరస్థులకు ఇరవై ఏళ్ల కారాగృహ నిర్బంధ శిక్షను విధించింది. అయితే ఈ తీర్పును ఆ తరువాత కెనడాలోని ఉన్నత న్యాయస్థానం రద్దు చేయడం అత్వాల్ అప్పటి నుంచి స్వేచ్ఛగా కెనడాలో జీవిస్తున్నాడు. దశాబ్దులుగా మనదేశానికి వ్యతిరేకి అయిన ఇలాంటి పేరుమోసిన బీభత్సకారుడు కెనడా ప్రధానమంత్రి వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో ఉండటానికి ఉభయ దేశాల ప్రభుత్వాల ఘోరమైన నిర్లక్ష్యం. ముంబయిలో బుధవారం జరిగిన ఒక విందు సమావేశంలో కెనడా ప్రధానితో కలసి ఈ దుండగుడు పాల్గొన్నాడు. కెనడా ప్రధానమంత్రి భార్య సోఫీట్రూడూ భార్యకు సమీపంలో ఈ జస్వాల్ అత్వాల్ నిలబడి ఉన్న దృశ్యం కూడా మాధ్యమాలలో ప్రచారం అయింది. దీనివల్ల కెనడా ప్రధాని కుటుంబానికి ఇతగాడు బాగా పరిచితుడన్న భ్రమ కలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ ప్రచారం తరువాత ఢిల్లీలో కెనడా రాయబార కార్యాలయం- హైకమిషన్- వారు ఇచ్చిన విందుకు జస్వాల్ హాజరు కాకుండా నిరోధించగలగడం ‘‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న’’ తీరునకు నిదర్శనం.
విచ్ఛిన్నకాండ, దేశ వ్యతిరేక బీభత్సకాండ మనదేశానికి వలెనే కెనడా దేశాన్ని కూడా పట్టి పీడిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం! మనదేశంలోని పంజాబ్‌లో ఎగిసిపడిన ‘‘ఖరిస్థాన్’’ బీభత్స దావాగ్నిజ్వాలలు అడుగంటిపోయాయి, ఆరిపోయాయి. కెనడాలోనే ‘‘క్యూబెక్’’ ప్రాంతంలో శతామ్దికి పైగా విచ్ఛిన్నకాండ కొనసాగుతోంది. ఈ విచ్ఛిన్నకీలలు ఉవ్వెత్తున ఎగిసి పడడం, శాంతించడం నిరంతరం పునరావృత్తం అవుతున్న ఘటనలు! అందువల్ల బీభత్సకాండకు వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు జరుపాలని శుక్రవారం మన ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని ట్రూడూ పునరుద్ఘాటించడం అనివార్యమైన పరిణామం. ఈ పరిణామానికి ‘పసిఫిక్’ ప్రాంతంలోను, హిందూమత మహాసాగర జలాలలో చైనావారి ‘విస్తరణ’ వికృత నేపథ్యం. ఉత్తర కొరియాలో మాల్‌దీవులలో అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న కల్లోలానికి ఈ ‘విస్తరణ’ ప్రత్యక్ష ప్రేరకం పరోక్ష ప్రేరకం. అందువల్ల భారత కెనడాల మధ్య సాన్నిహిత్యం పెరగడం సహజ పరిణామం. ట్రూడో భార్యతోను ముగ్గురు పిల్లలతోను కలిసి ఇన్నిరోజులపాటు మన దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించడం ఆయనకు మనదేశం పట్ల కల వ్యక్తిగత మమకారానికి నిదర్శనం. 1983లో తన తండ్రి ప్రియరీ ట్రూడూతో కలిసి జస్టిన్ ట్రూడో మనదేశానికి వచ్చాడట! అప్పుడు ప్రియరీ ట్రూడూ కెనడా ప్రధానమంత్రి!!
ఐరోపావారి దురాక్రమణకు గురికావడం మన దేశానికి, కెనడాకు మధ్య గల మరో సమానత్వం. ఐరోపా దురాక్రమణకారులు మనదేశపు జాతీయ స్వభావాన్ని చెఱచారు. మనదేశ స్వరూపాన్ని వికృతం చేసి విభజించారు. కానీ అమెరికాలోను ఆస్ట్రేలియాలోను ఐరోపా వారు ఆయా ప్రాంతాలలోని అనాది జాతులను సమూలంగా నిర్మూలించారు. తామే అక్కడ కొత్త జాతులుగా ఏర్పడినారు. కెనడాలోని ‘ఎస్కిమో’ వంటి అనాదిజాతిని బ్రిటన్‌వారు ఫ్రాన్స్‌వారు పోటీపడి నిర్మూలించారు. క్యూబెక్ ప్రాంతంలో ఫ్రాన్స్‌వారు అత్యధికంగా స్థిరపడగా మిగిలిన కెనడా బ్రిటన్‌వారు ఆధిక్యం సాధించారు. అందువల్ల బ్రిటన్‌కూ ఫ్రాన్స్‌కు మధ్య యుద్ధాలు జరిగాయి. మనదేశంలో వలెనే !! క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దిలో బ్రిటన్‌కూ, ఫ్రాన్స్‌కు మధ్య ‘‘దొంగలు ఊళ్లు పంచుకున్న రీతిలో’’ ఒప్పందం కుదిరింది. మనదేశంలోని పుదుచ్చేరిని ఫ్రాన్స్‌కు అప్పగించిన బ్రిటన్, ప్రతిఫలంగా కెనడాలోని ‘క్యూబెక్’ను పుచ్చుకొంది. కానీ ఫ్రాన్స్ సంతతికి చెందిన ‘క్యూబెక్’ వాసులు దశాబ్దులుగా కెనడా నుంచి విడిపోవడానికి, ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి పోరాడుతున్నారు. ఈ పోరాటం కారణంగా కెనడా ప్రభుత్వం విచ్ఛిన్నకారులను బుజ్జగిస్తోంది. కెనడాలో ఆంగ్లంతో పాటు ఫ్రాన్స్ భాష కూడా ఆధికారిక భాష కావడం ఈ బుజ్జగింపులో భాగం.