సబ్ ఫీచర్

‘ఇండియా - దట్ ఈజ్ భారత్’ ఒకే జాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ భారతావని నాటి చిన్న చిన్న రాజ్యాలు కనుమరుగై ప్రజాస్వామ్య పాలనా విధానంలో స్వతంత్ర భారతం ఆవిర్భవించింది. సంస్కృతంలో రాజ్యానికి రాష్ట్రం అనే పేరు వుండటంతో, స్వాతంత్య్ర పోరాట కాలంలో అంకురించిన హిందూమత భావైక్యత, దేశం లేదా రాజ్యం లేదా ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని హిందూత్వ విశ్వాసులు ప్రగాఢంగా ఆకాంక్షించారు. బ్రిటిష్ పాలనను పారద్రోలే స్వాతంత్య్రోద్యమంలో జాతిని ఒకే త్రాటిపై నడిపించే చైతన్య సాధనలో జాతినేతలు మతానికి ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌లో తొలితరం జాతినేతలు హిందుత్వ ఉన్నత లక్ష్యాల సాధనలో జాతిని చైతన్యవంతం చేసారు. కాని మత ప్రాతిపదికన దేశవిభజన, అఖండ భారతావని ఒకే హిందూ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలనే ప్రగాఢ వాంఛను నీరుకార్చింది. గాంధీజీ నాయకత్వంలోని నాటి కాంగ్రెస్ పార్టీ నాటి పరిస్థితులలో అనివార్యమైన దేశవిభజనను ఆమోదించక తప్పలేదు. 1949లో పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా అవతరించిన తరువాత, భారతదేశానికి పేరు నిర్ణయించే అంశంపై కానిస్టిట్యూట్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఆర్టికల్(1) రాజ్యాంగ నిర్మాణంలో ‘్భరత్’ అనే మాట ‘ఇండియా’ అనే మాటకు ముందు ఉండాలా లేక వెనుక ఉండాలా? అనేది నాటి వివాదాంశం. ఇండియాకు ముందు మాటగా భారత్ ఉండాలనే అభిప్రాయానికి 38 ఓట్లు రాగా, 51 ఓట్లు తరువాత ఉండాలనే వాదనకు రావటంతో రాజ్యాంగం ఆర్టికల్ (1) ప్రకారం ‘ఇండియా దట్ ఈజ్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్’గా నిర్ధారితమైంది. అప్పటినుంచి రాష్ట్రం అనే మాటకు అర్థం దేశం లేదా రాజ్యంగా కాకుండా రాష్ట్రాల కలయిక ‘ఇండియా-్భరత్’ అయింది.
1915లో హిందూ జాతీయనేతగా పండిత్ మదనమోహన మాలవ్యా హిందూ మహాసభ స్థాపించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాలుగుసార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. 1937 వరకు మహాసభ, కాంగ్రెస్ వార్షిక సభలలో ఇంచుమించు అంతర్భాగంగా ఉంది. దేశవిభజనకు ఒక దశాబ్దం ముందు రోజులలో హిందుత్వ రాజ్యవాదన తలయెత్తి క్రమేపీ పటిష్టమైంది. 1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా 14 మంది కేబినెట్ సభ్యులలో ‘ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్’ బాధ్యతను డా.శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేపట్టారు. నెహ్రూతో విభేదాల కారణంగా డా.ముఖర్జీ రాజీనామా చేశారు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యునిగా చరిత్ర సృష్టించారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ పార్టీ సైద్ధాంతిక భూమికను రూపొందించారు. సంస్థాగత పునాదులు నిర్మించారు. స్వాతంత్య్రానంతరం దేశ రాజకీయాలలో భారతీయ ఆలోచనా విధానం, విలక్షణ రాజకీయ దృక్పథంతో జనసంఘ్ ఉద్యమాలు చేపట్టింది. 1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రెండవ స్వాతంత్య్ర పోరాటంలో జనసంఘ్ జనతా పార్టీలో విలీనం అయింది. 1980లో జాతీయవాదం, దేశభక్తి అంశాలలో రాజీ పడకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా అంకురించింది. క్రమేపీ 1952లో 3 స్థానాలు కైవశం చేసుకొన్న భారతీయ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా తొలి ప్రతిపక్ష స్థాయి నుంచి అధికార పార్టీగా 2018 నేటికీ ఎన్‌డిఎకి బలమైన సారధ్యం వహించే స్థాయికి ఎదిగింది. అది భారతీయ ప్రజాస్వామ్య దేశ ఘన విజయం. అది హర్షణీయం.
ప్రస్తుత పాలనా వ్యవస్థలో రాజ్యం లేదా దేశం, రాష్ట్రాలన్నీ కలుపుకు పోవలసిందే. రాచరికం ఇక పతనమయినట్టే. ప్రజాగ్రహం ఏ రాష్ట్ర అధికారాన్ని అయినా పడగొడుతుంది. 70 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రజాస్వామ్యంలో ఇందిరకు నామరూపాలు లేకుండా మట్టికరిపించారు. అది బిజెపి-తెలుగుదేశం విజయం అనుకొంటే భ్రమపడినట్టే. ప్రస్తుత బిజెపి సారధ్యం, భూగర్భంలో ఒకప్పుడు పాతిపెట్టిన కంకాళాలను, త్రవ్వి బయటకు తీసే రాజ్య వ్యవస్థ మతాధిపత్యానికి ప్రోత్సాహం ఇచ్చే ధోరణులు స్పష్టం అవుతున్నాయి. ఏ మతమైనా దేశం, ఒక రాజ్యాధికార వ్యవస్థగా ప్రతిష్టించబడే సిద్ధాంతాలకు కాలం చెల్లిపోయింది. ప్రస్తుత భారతావని స్థితిగతులలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య భావ సారూప్యత లేదు. 15వ దేశ ప్రధానిగా మోదీ, జాతీయ విధానం పేరిట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్ర ప్రజల వాంఛితాలను ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో చిన్నచూపుతో అవమానిస్తే ‘దక్షిణాది ఐక్యత’ భవిష్యత్ భారతావనికి సంకేతం ఇస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు, తాత్కాలికంగా అవకాశవాదంగా కేంద్రాధికారానికి కొమ్ము కాసినా, తదనంతర రాజకీయ పరిణామాలు అనుభవించక తప్పదు.

- జయసూర్య 9440664610