Others

అనువాద కథాసౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ్‌చంద్ కథలు
వెల: రూ.160
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు

తెలుగు అనువాద సాహిత్యానికి ‘దీపస్తంభాలు’ అనదగ్గవారు ఇద్దరు. ఒకరు శరత్‌చంద్ర ఛటర్జీ. మరొకరు ప్రేమ్‌చంద్. ప్రేమ్‌చంద్ అసలు పేరు ధన్‌పత్‌రాయ్ (1880-1936). హిందీ భాషలో అనేక కథలు, నవలలు రాశారు. చిత్ర విచిత్రమైన పోకడలతో, రమ్యహర్మ్యాలు, రాచభవనాలు, రాజులు రాణులు, ఆకాశయానం, పరకాయ ప్రవేశం లాంటి ‘్ఫంటసీ’లో తేలిపోతోన్న హిందీ సాహిత్యాన్ని నేల మీదకు దింపి, నిజ జీవితంలోని ఆకలి, దారిద్య్రం, జమీందారీ రాక్షసత్వం, పరాయి ప్రభువుల పాలన, రైతుల బాధలు, పల్లె జీవితాన్ని పరిచయం చేశారు. రష్యన్ రచయితలు, గాంధీ బోధనలు ప్రేమ్‌చంద్‌పై గొప్ప ప్రభావానే్న చూపి, ఆనాటి ఆంగ్ల ప్రభువుల ఆగ్రహానికి గురియైనా కూడా, మొక్కవోని దీక్షతో రచనల్ని సాగించిన వైతాళికుడు.
ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి నలుగురికీ ఆదర్శంగా బతకాలనుకోవటం వల్ల ప్రేమ్‌చంద్ రచనలలో, నిరాడంబరత, సారళ్యత, బడుగుజీవుల యెడ సహానుభూతి కనిపిస్తుంది. చిన్న నాటనే తల్లిని పోగొట్టుకోవడం వల్ల కాబోలు - కథలో కరుణ, దయా, జాలి పుష్కలంగా కనిపిస్తాయి. వందేళ్లు గడుస్తున్నా వీరి స్థానాన్ని భర్తీ చేయగల రచయిత ఇంతవరకూ రాలేదంటే, రచయిత శిఖరాయమాన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత కథాసంకలనం - ‘ప్రేమ్‌చంద్ కథలు’ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మన ముందుకు తెచ్చారు. ఇందులో 15 కథలున్నాయి. ప్రేమ్‌చంద్‌ను, ఆయన కథల్నీ, ‘స్థాలీపులాక న్యాయం’గా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలనుకున్నారు ప్రకాశకులు. కనుక ఇందులో రాజ్యాలు, రాజులు, రాణులు కనిపిస్తాయి. దేశభక్తి ప్రబోధం, మాతృప్రేమ, రైతుల కష్టాలు కడగళ్లు, సంసార జీవనం, ఆనాటి కట్టుబాట్లు కనిపిస్తాయి.
నిండు యవ్వనంలో మాతృభూమిని వదిలి అమెరికా వెళ్లి అతిసంపన్నుడయినా, తొంభయి ఏళ్ల వయసులో తిరిగి స్వదేశానికి వచ్చి గంగానది ఒడ్డున చిన్న కుటీరంలో నివసిస్తూ మాతృభూమి ఒడిలో ప్రాణాలర్పించాలనుకోవటం ఒక గొప్ప కోరిక ‘ఇది నా మాతృభూమి’. ‘సమరయాత్ర’లోని ముసలి నౌహరీకి అలానే అనిపిస్తుంది. రాజులు, రాజ్యాలు, క్షత్రియధర్మం, అమరప్రేమ ‘మర్యాద వేదిక’లో కనిపిస్తాయి. ఇలాంటిదే మరో కథ ‘రాణీసారంధ’
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ప్రేమ్‌చంద్‌కి ‘పాల విలువ’ తెలుసు. అందుకే ఈ కథలో ‘్భంగీ’ (పాకీ) జాతి భూంగీ, పేదరాలైనా సంపన్నుడు మహాశనాథుని ఇంట్లో ఆయన కొడుకు సురేష్‌కు పాలిస్తూ, ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. తరం మారుతుంది ‘పాల విలువ’ తగ్గుతోంది. పాపం భూంగీ కొడుకు మంగళ్ అదే ఇంట్లో అష్టకష్టాల పాలవుతాడు. పుట్టింటి వైభవం మెట్టినింట్లో కనిపించదు. అందువల్ల ‘ఆనంది’ (కోడలు) ఎంతటి వ్యధకు గురవుతుందో అది అన్నదమ్ముల మధ్య ఎలా చిచ్చు రగుల్చుతుందో ‘చివరకు ఆ కాపురం ఎలా సుఖాంతం’ అవుతుందో ‘గొప్ప ఇంటి పిల్ల’ చెబుతుంది. చిన్నచిన్న కమతాలు, మిగులులేని సేద్యం, మూడు రూపాయలు పెట్టి పుష్యమాసం చలిని కాచుకోవటానికి కంబళీ కొనుక్కోలేని బడుగు జీవితం హల్కూది (పుష్యమాసం రాత్రి). అంతే నిర్భర జీవితం ప యాంగ్ ది (అగ్ని సమాధి). ఇద్దరూ ఎలా పరిస్థితులకు బలి అవుతారో చెబుతాడు రచయిత. భోలా మహతో భార్య చనిపోతుంది. పన్నా రెండో భార్య రగ్ఘూ కొడుకు. తన మంచితనంతో పన్నా మరియు సవతి పిల్లల మనసు గెలుచుకుంటాడు. రగ్ఘూ భార్య ములియా. భర్తతో వేరు కాపురం పెట్టిస్తుంది. పన్నా ములియాల మధ్య అంతగా సఖ్యత లేకున్నా రగ్ఘూ మరణానంతరం, పన్నా ములియాను తన కోడలిగా స్వీకరిస్తుంది. మరిదిని పెళ్లాడటం, బహుశా ఆ తెగవారి ఆచారం కాబోలు (వేరు కాపురం)
అనువాదకుడు అక్కడక్కడా, ఉత్తాలం (పే 1), వావిడచి (పే.7) ప్రేమబాణవిద్దులు (పే.17) పేర్వాసి (పే.82) లాంటి పదాలు వాడటం వల్ల పాఠకులు కాస్త కొత్తదనం ‘అనుభూతించే’ అవకాశం ఉంది. కథాసంకలనం మొదట్లో ప్రేమ్‌చంద్ జీవిత వివరాలు ఇవ్వటం బాగుంది.

-కూర చిదంబరం 8639338675