Others

ఒకప్పుడు మాత్రమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమాంతే తత్ర దేవతాః
పెళ్ళైన కొత్తలో-
ఆమె ఒక అపరంజి బార్బరీ బొమ్మ
ఆపై ఒక అందాల రాక్షసి
నిజానికి ఆమెయే ఒక అమూల్య రత్నం
వజ్ర వైఢూర్యాలు పొదిగిన సింహాసనం
ఆమె చిరు దరహాసమే
నాకు మధురాతి మధురమైంది
ఇల్లంతా ఆమె చూపులతో వెనె్నల కాసింది
జిలుగు వెలుగులు నింపింది
ఆమె లేకుంటే నేను లేను
ఆమె లేని మరుక్షణమే శూన్యమై పోతాను
ఆమె లేకుంటే-
నాకో రూపం లేదు నాలో ఏ తాపం లేదు
నా ఇంట్లో దీపం ఆమె ధూపం ఆమె
ఆమె లేని ఇల్లు పాడుబడిన గుడి
అందుకే-
యత్ర నార్యస్తు పూజ్యంతే
రమాంతే తత్ర దేవతాః

-గులాబీల మల్లారెడ్డి 9440041351