తెలంగాణ

వెబ్ పోర్టల్‌లో టెన్త్ హాల్‌టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: పదో తరగతి విద్యార్థుల హాల్‌టిక్కెట్లు పరీక్షల బోర్డు వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ తెలిపారు. విద్యార్థులు ఆ హాల్‌టిక్కెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ బిఎస్‌ఇ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. పరీక్షలు మార్చి 15 నుండి ప్రారంభం అవుతాయని, ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని ఆయన చెప్పారు. మార్చి 15న ఫస్టు లాంగ్వేజి పేపర్-1, కాంపోజిట్ కోర్సు పేపర్-1, మార్చి 16న ఫస్టు లాంగ్వేజి పేపర్-2, కాంపోజిట్ కోర్సు పేపర్-2, 17న సెకండ్ లాంగ్వేజి , 19న ఇంగ్లీషు-1 జరుగుతుందని అన్నారు. 20న ఇంగ్లీషు-2, 21 మాథ్స్ పేపర్-1, 22న మాథ్స్ పేపర్-2, 23న జనరల్ సైన్స్ -1, 24న జనరల్ సైన్స్-2, 27న సోషల్ స్టడీస్ -1, 28న సోషల్ స్టడీస్ -2, 29న ఒఎస్‌ఎస్‌సి పేపర్-1, 31న ఒఎస్‌ఎస్‌సి పేపర్-2, ఏప్రిల్ 2న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు పేపర్లు ఉంటాయని చెప్పారు. పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
శ్రీచైతన్య జయభేరి
ఐఎన్‌టిఎస్‌ఓ ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విజేతలుగా నిలిచారు. అఖిల భారత స్థాయిలో 75 మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు గ్రాండ్ ప్రైజ్ సాధించారు. 82 మంది ట్యాబ్స్ గెలుపొందారని అకడమిక్ డైరెక్టర్ సీమ పేర్కొన్నారు. అంతేగాక, 114 మంది విద్యార్థులు ప్రత్యేక బహుమతులను, 2664 మంది ప్రొత్సాహక బహుమతులను పొందారని అన్నారు. అకడమిక్ ప్రొగ్రామ్స్, మైక్రో లెవెల్ టీచింగ్ సిస్టం, అంకితభావంతో పనిచేసే అధ్యాపకులే కారణమని ఆమె చెప్పారు.
శివ్‌నాడార్‌లో ఎంబిఎ
శివ్‌నాడార్ యూనివర్శిటీ ఎంబిఎ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్టు స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ ఎంట్రిప్రిన్యూర్‌షిప్ డైరెక్టర్ డాక్టర్ శుభ్రోసేన్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని, దరఖాస్తుదారులకు బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్టు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు.