క్రీడాభూమి

భారత్‌కు యువ శక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఆస్ట్రేలియాతో తొలి టి-20
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను మినహాయించి భారత ఆటగాళ్లు టి-20 ఫార్మెట్‌లో ఎక్కువగా ఆడకపోవడం ఆస్ట్రేలియాకు లభించనుంది. 2006లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రోగ్రామ్ షెడ్యూల్‌లో టి-20 ఫార్మెట్‌కు చోటు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ భారత్ కేవలం 57 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడింది. వీటిలో 28 మ్యాచ్‌లు 2007, 2009, 2010, 2012, 2014లో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడినవే కావడం విశేషం. మిగతా మ్యాచ్‌ల విషయానికి వస్తే టీమిండియా 14 టి-20 ఇంటర్నేషనల్స్‌ను గెల్చుకుంది. 15 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్‌లో రాణించాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి-20 మ్యాచ్‌ల్లో వివిధ కాంబినేషన్స్‌ను ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కెప్టెన్ ధోనీ తీసుకునే నిర్ణయాలు సిరీస్‌లో కీలకం కానున్నాయ.

అడెలైడ్, జనవరి 25: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన టీమిండియా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే టి-20 సిరీస్‌ను కైవసం చేసుకొని పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్‌కు యువరాజ్ సింగ్ చేరిక కొత్త ఊపిరినిస్తున్నది. 2014 టి-20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన యువీకి అనూహ్యంగా మళ్లీ జట్టులో స్థానం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అతను కృషి చేస్తాడనడంలో సంతదేహం లేదు. స్వదేశంలో మరో రెండు నెలల్లో జరిగే టి-20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ సెలక్టర్లు పలు కాంబనేషన్స్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగానే యువ, సీనియర్ ఆటగాళ్ల మేలికలయికగా భారత టి-20 జట్టును రూపొందించారు. యువీ, సురేష్ రైనా జట్టులోకి రావడంతో మిడిల్ ఆర్డర్‌ను వేధిస్తున్న నిలకడలేమికి తెరపడనుంది.
రెండో ఓపెనర్ ఎవరు?
ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగే మొదటి టి-20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ను ఎవరు మొదలు పెడతారన్న ప్రశ్న ఆసక్తిని రేపుతోంది. ఆజింక్య రహానే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శిఖర్ ధావన్‌కే అవకాశం దక్కవచ్చు. వనే్డ సిరీస్‌లో ధావన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే, రహానే అందుబాటులో లేకపోతే, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాన్ని ధావన్ దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. సిడ్నీ వనే్డలో సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించిన మనీష్ పాండేకు టి-20 జట్టులో స్థానం దక్కలేదు. అతని స్థానాన్ని యువీ భర్తీ చేస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాలుగో స్థానంలో అతను బ్యాటింగ్‌కు దిగితే, ఐదు, ఆరు స్థానాల్లో రైనా, ధోనీ ఆడతారు. మొత్తం మీద బ్యాటింగ్ లైనప్ దాదాపుగా ఖాయమైంది.
బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠపరచడానికి ధోనీ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, ఉమేష్ యాదవ్, రిషీ ధావన్, గుర్‌కీరత్ సింగ్ మాన్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య నుంచి తుది జట్టులోకి అతను ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన వనే్డ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన బుమ్రా తన నైపుణ్యంతో ధోనీని ఆకట్టుకున్నాడు. కాబట్టి, మొదటి టి-20లో అతనికి అవకాశం దక్కవచ్చు. ఉమేష్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్న నేపథ్యంలో అతనిని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంటాడా అన్నది అనుమానాలను సృష్టిస్తోంది. భువనేశ్వర్ కుమార్‌కు బ్యాకప్‌గా ఉన్న రిషీ ధావన్, వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాలో ఒకరికి స్థానం లభిస్తుందన్న వాదన వినిపిస్తున్నది. అశ్విన్ జట్టులోకి వస్తే, జడేజా, హర్భజన్ సింగ్‌లకు అవకాశంపై స్పష్టత ఉండదు. మొత్తం మీద బ్యాటింగ్ విభాగంలో స్థానాలు దాదాపుగా ఖాయమయ్యాయి. కానీ, బౌలింగ్ కాంబినేషన్‌పైనే జట్టు మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతున్నది.
ఊపుమీదున్న ఆస్ట్రేలియా
వనే్డ సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి టీమిండియాను చిత్తుచేసిన ఆస్ట్రేలియా టి-20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలన్న ఊపుమీద ఉంది. బిగ్ బాష్ క్రికెట్ టోర్నమెంట్ ఆ జట్టును టి-20 ఫార్మెట్‌కు సంసిద్ధం చేసింది. గ్లేన్ మాక్స్‌వెల్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కి దూరం కావడం మినహా ఆస్ట్రేలియాను వేధిస్తున్న సమస్యలు ఏవీ లేవనే చెప్పాలి. ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తున్న ఆ జట్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్ మాథ్యూ వేడ్, షాన్ టైట్ నాథన్ లియాన్ వంటి సమర్థులున్నారు. భారత్‌ను తక్కువ అంచనా వేయలేకపోయినా, ఆస్ట్రేలియాకు ఎంత వరకూ గట్టిపోటీనిస్తుందనేది అనుమానంగా ఉంది.