డైలీ సీరియల్

యాజ్ఞసేని 58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మరాజు తన భవనంలో ఏకాంతంగా కూర్చొని వ్యాసమహర్షి చెప్పినదాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు.
ధర్మరాజు చేసిన ప్రతిజను గూర్చి తెలిసిన యాజ్ఞసేని భర్త కూర్చున్నచోటికి వచ్చింది.
‘‘ప్రభూ!’’ అని పిలిచిన పిలుపుతో ధర్మరాజు ఏకాంతత భగ్నమయింది. యాజ్ఞసేనిని దగ్గరగా రమ్మని సైగజేశాడు. ద్రౌపది సమీపానికి వచ్చి నిలబడింది.
‘‘ద్రుపదరాజ పుత్రీ రాజసూయయాగం నిర్విఘ్నంగా పూర్తయిందిగదా?’’ అని అన్నాడు.
‘‘రాజసూయం ముగిసింది. కానీ! అని అన్నది. ఆ మాటలకు ధర్మరాజు ద్రౌపది ఏదో చెప్పటానికి సంశయిస్తున్నదని అని అనుకొని
‘‘యాజ్ఞసేనీ! ఏదో చెప్ప సంశయిస్తున్నావు. ఏమిటది.? అని అడిగాడు.
‘‘ప్రభూ! రాజసూయం ముగిసింది. మీరు సామ్రాట్టులయ్యారు! రాబోయే కాలంలో అనర్థాలు సంభవించగలవని వ్యాసభగవానుడు శెలవిచ్చాడని విని నా హృదయం కలత చెందుచున్నది.
దీనికి పరిష్కారమేమిటి? మీరు ఎవ్వరినీ భేదభావంతో చూడననీ ఎవరిపట్ల భేదభావంతో ప్రవర్తించననీ ప్రతిజ్ఞాబద్ధులయ్యారని విన్నాను.
దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడు తనకు సభాభవనంలో అవమానం జరిగిందని రగిలి పోతున్నాడు. క్రుంగి పోతున్నాడు. ఆ కోపంతోనే హస్తినకు చేరినట్లు తెలిసినది. ఆ క్రూరుడు పాండుపుత్రులకు ఏ విధమైన కష్టాలను కలిగించ ప్రయత్నిస్తాడో అని అనుమానంగా ఉన్నది’’ అని అన్నది.
ద్రౌపది సాధ్వి. తెలివిగలది. దూరదృష్టి గలది. మాకు ఎలాంటి విపత్తులు కలుగగలవోనని వ్యధ చెందుతున్నది. ఇది సహజం. అని తలంచి
‘‘దౌపదీ! సమయం రాగానే నా కారణంగా, దుర్యోధనుని అపరాధం వలన, భూమండలం లోని రాజులందరూ పరస్పరం యుద్ధంలో నాశనవౌతారనీ, కాలం దాటరానిదని మహర్షి వ్యాసభగవానుడు శలవిచ్చారు. అది నన్ను కలచివేస్తున్న విషయం నిజమే. నా మూలంగా ఎలాంటి ఉపద్రవాలు సంభవించ కూడదని తలంచి యిక ముందు ఎవరి పట్లనూ భేదభావం రాకుండా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ధర్మం పవిత్రమైంది. దానిని అతిక్రమించటం స్వనాశనాన్ని కొని తెచ్చుకున్నట్లే. ధర్మహాని కలగటం మంచిది గాదు. ధర్మనే మనలను రక్షిస్తుంది’’ అని ధర్మరాజు తన మానసిక వ్యధను ద్రౌపదికి చెప్పి కొంత ఉపశమనాన్ని పొందాడు.
‘‘అయితే నా సంశయం నిజమేనన్నది దృఢపడింది. ఏ సమయంలో ఏ ఉపద్రవం సంభవించగలదో ఎవరికెరుక? ధర్మానికి ప్రతిబింబమైన మీబోంటి వారికి కూడా కష్టాలు కలగటమనేది ఊహించరానిది. విధాత నిర్ణయమేమిటో గదా?’’ అని అన్నది యాజ్ఞసేని.
‘‘కాలానికి ఎదురీదగలిగినవాడు లేదు. సత్యసంధుడైన హరిశ్చంద్రు డంతటివాడే అష్టకష్టాలను అనుభవించాడు. సత్యానికై చివరకు భార్యాపుత్రులను కూడా అమ్మి కష్టాల పాలయ్యాడు.
‘‘నల మహారాజంతటి వాడు కలి ప్రభావానికి తలొగ్గి కష్టాలను అనుభవించాడు. అంతటి చక్రవర్తులు, సామ్రాట్టులు కూడా కాలానికి తలొగ్గి కష్టాలను అనుభవించాడు. అంతటి చక్రవర్తులు, సామ్రాట్టులు కూడా కాలానికి తలొగ్గినవారే కదా? వారి ముందు నేనెంతటి వాడిని.
అందువలన నేనుగూడా కాలానుగుణంగానే నడవాలి గదా? గతకాలము మేలు వచ్చు కాలము కంటె’’ అని అన్నాడు. ద్రౌపది వౌనంగా ఉండగా ధర్మరాజు మరలా అన్నాడు.
‘‘్భగవానుడైన ఆ శ్రీకృష్ణవాసుదేవుడే మనకు రక్షకుడు. అతడి దయగలదేని ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చును అని నా నమ్మకం. ఇన్నాళ్లు మనలను కాపాడినివాడు అతతే గదా?’’ అని.
యాజ్ఞసేని మాట్లాడకుండా నిష్క్రమించింది.
ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. తన గుప్తచరులను పిలిపించుకొన్నాడు. వారిని హస్తినలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియపరచమని ఆజ్ఞాపించాడు.
-- (35) --
హస్తినాపురము. దుర్యోధనుని భవనము.
దుర్యోధనుడు తన భవనంలో ఆసీనుడైవున్నాడు. ప్రక్కనే గాంధార దేశపు యువరాజు, సుబలుని పుత్రుడు అయిని శకుని కూడా ఆసీనుడై వున్నాడు. పాండవులు వృద్ధి పొందటం చూచిన దుర్యోధనుడు దానిని సహించలేక పోయాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము