ప్రసాదం

ఈశ్వరమయం జగత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మానవుల జాతకాలను ప్రభావితం చేసేవి రాహు కేతు గ్రహాలు కాదు. అహంకార మమకారాలు’’ అంటారు మహనీయులు. అహంకార మమకారాలు మనుషుల్ని పాడుచేస్తాయి. పాతాళాన పడదోస్తాయి. అందుకని మనం ఆ రెండింటికి దూరంగా ఉండాలి. వాటిని దూరంగా ఉంచగలిగాలి.
ఓశ చోట మహాసభ జరుగుతోంది. ప్రధాన వక్త, తన ఉపన్యాస పఠిమలో శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాడు. మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. దాంతో ఆ వ్యక్తికి ఎక్కడో చిన్న అహంకారం ఆవరించింది. ఈ ప్రతిభ అంతా నాదే అనే భావన తలకెక్కింది.
ఇది గమనించింది ఎదురుగా వున్న మైకు. మనస్సులో అనుకుంది. నేనే గనుక ఇతనికి సహకరించకపోతే ఈయన ఉపన్యాసం ఏమయ్యేది? ఎవరికీ వినిపించకుండా ఎగతాళి పాలయ్యేది. కాబట్టి ఈ ప్రతిభ అంతా నాదే అనుకుంది మైకు. ఇది గమనించి, ఆ మైకుని వైరుకి కలిపే గుండ్రటి స్క్రూ లాంటి పరికరం ‘నేనే లేకపోతే ఏమయ్యేది? అని అహంకారంతో తలెగరేసింది.
ఇది చూసిన వైరు నేనే లేకపోతే ఇది ఎంతలా పనిచేసినా అంతా వ్యర్థమే కాబట్టి ఈ ఉపన్యాసం ఘనత అంతా నాకే చెందుతుంది అనుకుంది మైక్ సెట్‌కి తగిలించిన వైరు.
వైరుకి తలకెక్కిన తల పొగరుని గమనించింది అవతల ప్రక్కన స్పీకర్లకి కలిపే గుండ్రంగావుండే మరో పరికరం.
నేనే గనుక ఆ వైరుతో కలిసి ఉండకపోతే, సహకరించకపోతే ఏమయ్యేది? వైరుని స్పీకర్‌కి కలిపే ఆ గుండ్రటి చిన్న పరికరం దాన్ని గమనించిన స్పీకర్ కూడా ఆ గొప్పంతా తనదే అనుకుంది. నేను గనుక సరిగ్గా పని చేయకపోతే ఏమయ్యేది అనుకుంటూ అహకరించుకుంది.
ఇది గమనించిన యాంప్లిపియర్ అనుకుంది వీటన్నింటి గొప్ప ఏముంది? అంతా నావల్లే అనే అహంభావం యాంప్లిపియర్ తలకెక్కింది. ఇదంతా గమనించింది మైక్. మైక్ వ్యవస్థంతా పనిచేయాలంటే అవసరమైన విద్యుత్.
వీళ్ళంతా ఇంతలా ఇదంతా వీళ్ళ ప్రతిభ, వీళ్ళ మహత్మ్యమే అని అనుకుంటున్నారు. ఇవన్నీ ఎంత గొప్పగ ఆపనిచేసినా నేనే లేకపోతే ఏం లాభం? అనుకొంది విద్యుత్. అహంకారంతో తల ఎగరేసింది. ఈ విశేషమంతా నావల్లనే అని అనుకొంది. ఈ రకంగా విర్రవీగుతున్న విద్యుత్‌ని చూసిన నీరు (గంగ)- ఈ విద్యుత్తుకి ఎంత పొగరు?
ప్రతిభంతా తనదే అని విర్రవీగిపోతోంది. అసలు నేనే లేకపోతే ఈ విద్యుత్ ఎక్కడినుంచి వచ్చేది అనుకుని నీరు అహంతో తల ఎగరేసింది. నీరునుంచే విద్యత్ పుడుతుందని అహంభావంతో, అహంకార పూరితురాలైన నీరుని చిద్విలాసంగా చూస్తున్నాడు పరమశివుడు. భగవత్వాన్ని గ్రహించలేని గంగ అమాయకత్వానికి జాలిపడ్డాడు.
అవును- ఆ శివుని జాటాజూటమే లేకపోతే గంగ అనేది ఎక్కడుండేది? ఆవిడ ప్రతిభ ఏమయ్యేది? ఒక్కసారి ఆలోచిద్దాం.. ఆలోచన చేద్దాం!
ఇదీ అంతా నేనే, అంతా నా వల్లే అనే అహంకారం కూడదని మామూలు సంఘటనలతో మహత్తర సందేశాన్నందించే మామూలు కథ.
కథ వెనుక కథ అన్నీ అంతా ఆ భగవత్ సంకల్పంగా ఆ భగవంతుని నిర్ణయం కారంగా జరుగుతాయి. జరుగుతుంటాయి. అనేబోధని పరోక్షంగా చెప్పే కథ. అన్నిటికీ భగవంతుడే మూలం. అన్నిటికీ అతని సంకల్పమే కారణం. సత్యాన్ని సృష్టిలో ప్రతి చోట ప్రతిపనిలో ఏదో ఒక విధంగా పరోక్షంగాపరమాత్ముడు తెలియజేస్తుంటాడు.
దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోగలగాలి. ‘నేను’ అనే అహం వీడాలి. ‘నాది’ అనే మమకారాన్ని వదులుకోవాలి. వదిలించుకోవాలి. అహంకార మమకారాల్ని వదులుకోవాలి. వదిలించుకోవాలి. అలా వదులుకోగల్గటమే అసలు సిసలైన విజయం. అన్నిటిలోను పరమాత్మను చూడగలగటమే సాధకుని కర్తవ్యం.
ఎవరైనా అంతా పరమాత్మ విభూతి అని మనసున నిలుపుకొని ఉంటే చాలు సర్వం సర్వాంతర్యామి లీల అని బోధపడుతుంది. అంతా ఈశ్వరుడైనపుడు అన్యం ఎక్కడ నుంచీ రాదు.
అసలు ఉన్నదే ఒకటే అయితే ఇక రెండోది అనే సమస్య ఉత్పన్నమే కాదు. అందుకే సత్యం ఒక్కటే . ధర్మం ఒకటే. ఈ సత్యధర్మాలను పాటించినట్లయితే ప్రతిదానిలోను పరమాత్మ కనిపించి తీరుతాడు.
ప్రతి వస్తువులోను అవస్తువులో చరచరావిశ్వమంతా విష్ణువే వ్యాపించి ఉన్నాడు. ఆ విష్ణుమాయకు చిక్కకుండా విష్ణునామాన్ని జపిస్తూ ఉంటే సర్వం జగన్నాథంగా కనిపిస్తుంది.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669*