రాష్ట్రీయం

దాల్మియా తరపున చిదంబరం వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఒక కేసు విచారణ ప్రారంభమైన తర్వాత నిందితులకు సమన్లు జారీ చేయరాదని కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది పి చిదంబరం హైకోర్టులో వాదించారు. జగన్ అక్రమాస్తుల కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు విచారిస్తున్న సంగతి విదితమే. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ తరఫున చిదంబరం శుక్రవారం హైకోర్టులో వాదించారు. ఈ కేసులో నిందితుడిగా దాల్మియా సిమెంట్స్ ఎండి పునితా దాల్మియా ఉన్నారు. దాల్మియా సంస్ధపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు విచారించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హాజరయ్యారు. తన వాదనలు వినిపిస్తూ.. చార్జిషీటు దాఖలైన తర్వాత తన క్లయింట్ పునిత్ దాల్మియాను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని చిదంబరం కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.