జాతీయ వార్తలు

దండిగా నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రామగుండంలో ఎన్టీపీసీ చేపడుతున్న 4వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్కేంద్రం శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి మొదటివారంలో తెలంగాణకు వస్తున్నారని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పూర్తికి 1.15 లక్షల కోట్లు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. హైకోర్టు విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, విభజన చట్టం హామీలను వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీని, సాయంత్రం 4 గంటలకు ఇంధన మంత్రి పియూష్ గోయల్‌తో కెసిఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ సంబంధించిన వివిధ అభివృద్ధి, విద్యుత్ పథకాలపై చర్చలు జరిపారు. రామగుండం ధర్మల్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీ అంగీకరించారని మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రం ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి, విద్యుత్ పథకాలకు ఆమోదం తెలిపినందుకు మోదీ, పియూష్‌కు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తొలుత ప్రధాని మోదీతో సమావేశమైన కెసిఆర్, కాళేశ్వరం సాగునీటి పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈమేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మోదీకి అందిస్తూ, 71,436 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్నట్టు దానిలో పేర్కొన్నారు. ప్రధాని నివాసంలో మోదీని కలుసుకున్న కెసిఆర్, అర్థగంట పాటు చర్చలు జరిపారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఐటిఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పధ్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు తెలంగాణ వార్షిక రుణ పరిమితిని జిఎస్‌టిపై .5 శాతం పెంచాలన్నారు. విభజన చట్టం హామీలమేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన వర్శిటీని కేంద్రీయ వర్శిటీగా గుర్తించి తగిన నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలోని ఇంటింటికి మంచి నీళ్లు సరఫరా చేసేందుకు చేపట్టిన భగీరథ పథకానికి పదివేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్రానికి కేటాయించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కి పెంచాలని కోరారు. హైకోర్టు విభజన తక్షణం చేపట్టాలని ప్రధానికి సూచించారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులను అధిగమించేందుకు తాముకోరిన విధంగా 3064 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. కేంద్రం తాము కోరిన దాంట్లో 791 కోట్లు మాత్రమే కేటాయించిందని చంద్రశేఖరరావు వివరించారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు తెలంగాణకు 30,571 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నెలకొల్పుతున్న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి ప్రాజెక్టుకు కేంద్రం అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేసి, నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని సిఎం కెసిఆర్ కోరారు. సాయంత్రం పియూష్ గోయల్‌తో సమావేశమైనపుడు కెసిఆర్ వెంట రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బూరా నరసయ్య గౌడ్, జితేందర్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి, తేజావత్ ఉన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో సిఎం కెసిఆర్ శనివారం సమావేశం కానున్నారు.