రాష్ట్రీయం

దుమ్ముగూడెం పేరు మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరును సీతారామ ప్రాజెక్టుగా, పాలేరు ఎత్తిపోతల పథకం పేరును భక్త రామదాసు ఎత్తి పోతల పథకంగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే జివో జారీ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్ష జరిపారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించేందుకు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈనెల 20 తరువాత రెండు రోజులపాటు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను పరిశీలిస్తానని చెప్పారు. ప్రతి జిల్లాలో జిల్లా ఇరిగేషన్ ప్రొగ్రెస్ కార్డును రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా రాయపట్నం దగ్గర ఆర్ అండ్ బి శాఖ నిర్మిస్తున్న హై లేవల్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హరీశ్‌రావు కోరారు.
తుమ్మల వెంటనే అధికారులతో మాట్లాడి జూన్ నాటికి బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని అదేశించారు. దీని వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్ధ్యం 148 మీటర్లు, 20 టిఎంసిల నీటిని నిల్వ చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగిస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌పై ఈనెల 15న సమావేశం కావాలని అధికారులకు తెలిపారు.