డైలీ సీరియల్

బంగారు కల 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రభూ! నాచే విరచితంబైన పారిజాతాపహరణ మహాప్రబంధంలో చాలావరకు విన్పించాను. నేడు విన్పించు రచన ఈ కావ్యానికి చాలా ముఖ్యమైంది. అవధరించండి.
అలకబూని కోప గృహంలో ఉన్న సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీకృష్ణుడు అనేక విధాల ఆమెను అనునయించాడు. చివరకు
పాటల గంధి.......... నుచిత వ్యాపారముల్నేర్తురే!
ఇంత జరిగినా శ్రీకృష్ణ స్వామి ఏమన్నాడో వినండి ప్రభూ!
నన్ను.........యికనైనా నరాళకుంతలా!
అంతా ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్ జగన్నాథుడయిన శ్రీకృష్ణుడు భార్య కాలితో తన్నినా ఓర్పు వహించినాడనే దీని భావం రాయల మనసుని ప్రభావితం చేసింది. దీనికి సంబంధించిన ఓ సంఘటన ఆయన స్మృతిపథంలో ఆ క్షణంలోనే మెదిలింది.
సాధారణంగా చక్రవర్తి వచ్చేదాకా మహారాణి తలగడమీద తలపెట్టి పడుకోకూడదు. మహారాణి కాళ్ళవైపున తలపెట్టి పడుకున్నది. ఆ రాత్రి రాయలు ఆలస్యంగా అంతఃపురంలోకి వచ్చాడు. మెలకువ రాకపోవడంతో మహారాజు ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలగడమీద తలపెట్టుకుని నిద్రపోయాడు. పొరపాటున మహారాణి కాలు ఆయనకి తగిలింది. ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మహారాణి కావాలనే రాజు తలను కాలితో తన్నిందని భావించి ఆగ్రహించి రాయలు అప్పటికప్పుడు అంతఃపురం వదలి వెళ్లాడు. ఆనాటి నుంచి మహారాణి అంతఃపురానికి ఆయన పోలేదు.
పారిజాత పుష్పాన్ని తనకివ్వకుండా సవతి రుక్మిణికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆగ్రహించిన సత్యభామ ఆయన తలను కాలితో తన్నినా కృష్ణుడు ఆగ్రహించలేదు. శ్రీకృష్ణదేవరాయలను కృష్ణాంశగా భావిస్తారు గాబట్టి ఆయన కూడా రాణిగారి కాలు తగిలినా ఆగ్రహించరాదని కావ్యబోధ.
శ్రీకృష్ణదేవరాయలు మహారాణిని అనుగ్రహించేట్లు చేయడం కావ్య ప్రయోజనం. మహారాణి నంది తిమ్మనను రాయల మనసును మార్చమని కోరిన కోరిక ననుసరించే నంది తిమ్మన అర్థస్ఫోరకంగా ‘పారిజాతాపహరణం’ రాశాడు. రాయలు ఆలోచిస్తున్నాడంటే కావ్య ప్రయోజనం నెరవేరినట్లేనని స్వస్తి పలికాడు తిమ్మన కవి.
మహాకవులు కావ్యాలు వెలయించటమే కాదు, కాపురాలు కూడా నిలబెట్టగలరనటానికి ఇది ఉదాహరణ మాత్రమే!
చింతలపాటి ఎల్లనకవి రాధామాధవ కావ్యాన్ని రుచి చూపించాడు. ప్రసిద్ధ కన్నడ కవి తిమ్మణ్ణి కుమార వ్యాసుని భారతం నుంచి కావ్యగానం చేశాడు. విద్యానందుడు, గుబ్బి మల్లహ్హణ్ణ, కుమారవాల్మీకి, చాటు విఠలనాథుడు తమ కావ్యాలనుండి కొన్ని భాగాలను విన్పించారు.
నాటి సభకు గురువులైన వ్యాసరాయలు, వాగ్గేయకారులైన పురందరదాసు, కనకదాసులు కూడా విచ్చేశారు. తమిళ కవి కుమార సరస్వతి ‘‘రాయల గజపతీ కుమారీ పరిణయం’’ నుండి కవితాగానం చేశాడు. హరిహరదాసుడు ‘‘ఇరు సమయ విళక్కుం గ్రంథం, జైన నిఘంటికుడు మండల పురందర్, జ్ఞానప్రకాశర్ ‘మంజరిప్పా’ గ్రంథం, తిరువారూర్, ‘తత్వప్రకాశర్’ ఆయా కవులచే సభాసదులకు పరిచయం చేయటం జరిగింది.
సంస్కృత కవులు శ్లోకాలు విన్పించారు. రాయలు తాను స్వయంగా సంస్కృతంలో రచించిన ‘మదాలస చరితం’ నుండి కవిత్వం విన్పించారు. కటకవాసి లొల్ల పండితుడు. ఈశ్వరదీక్షితుడు సత్కరించబడ్డారు. తనకు సంగీతం నేర్పిన లక్ష్మీ నారాయణను రాయలు వైభవంగా సత్కరించారు. తిమ్మరుసు మహామంత్రి తాను రచించిన ‘అగస్త్య భారత వ్యాఖ్య’లో కొంత సభకు విన్పించారు.
ముగ్గురు దేవేరులు ఈ సభను ఎంతగానో ఆనందించారు. సంస్కృతం అంతగా రాని చిన్నాదేవి, కర్ణాటక తమిళ భాషలు తెలియని అన్నపూర్ణాదేవి మూడు భాషల్లో విదుషి తిరుమలాంబ ఈ మువ్వురూ కవితా సౌరభాలను నిండు మనస్సుతో ఆస్వాదించారు.
భువన విజయ సభా ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక అపూర్వ ప్రకటన చేశారు. తెలుగు భాష తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే ఆ సన్నివేశం మరికొన్ని రోజుల్లోనే జరగనున్నదని తెలిసి అష్టదిగ్గజ కవులంతా ఆనందించారు. అటువంటి నిర్ణయానికి అప్పాజీ రాయలను అభినందించారు. అందరూ పెద్దన అదృష్టాన్ని వేనోళ్ల కొనియాడారు.
మంజరి కళ్ళు మాత్రం చంద్రప్ప కోసం ఆ సభలో నలుమూలలా వెదుకుతూ నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నాయి.
అప్పాజీ వారికి చేరువలో కానుకలు అందిస్తున్న పరిచారక సైనికుడు చంద్రప్ప అని గుర్తించడానికి ఆమె చాలా సమయం పట్టింది. దాదాపు సభ ముగిసే సమయానికి గానీ ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. ఇది గమనించిన చంద్రప్ప తనలో తాను ముసి ముసిగా నవ్వుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నాడు.
****
‘‘్ఫ! నీతో మాట్లాడాను’’ మంజరి అలక నటించింది.
‘‘మరి ఈ రాళ్ళతో మాట్లాడటానికి వచ్చావా?’’ చంద్రప్ప ఉడికించాడు.
‘‘అంత సభలో ఎక్కడున్నావని వెదకను’’ రోషంగా అంది.
‘‘ప్రస్తుతం నేను ప్రచ్ఛన్నంగా ఉన్నాను. రాయచూర్ విజయం దక్కింది గదా! ఇంక అజ్ఞాతవాసం తేలినట్లే’’
‘‘హమ్మయ్యా’’
‘‘మంజరీ! సుమూహూర్తం నిర్ణయించుకునే వచ్చాను’’ ఆమె ఆనందంగా చూసింది.
‘‘దసరా మహోత్సవాల్లో విజయదశమి శుభదినం. ఆనాడు మనం దంపతులమవుదాం. భువనేశ్వరీ దేవి, విరూపాక్షస్వామి కృపవల్ల ఈ విజయనగర సామ్రాజ్యంలో మనమూ నీడల్లానయినా మిగిలపోతాం’’.
‘‘చంద్రా! నాదో కోరిక’’
‘‘చెప్పు మంజూ’’
‘‘మన వివాహం తిమ్మరుసులవారి ఆశీస్సులతో జరగాలి. వారు కరుణా సముద్రులు. అడిగితే కాదనరు. నాకు ఎవరున్నారు? తల్లి పోయింది. వారిని నేను పితృదేవతలుగా సంభావించాను. తిమ్మరుసు తనయులు కూడా సోదరులుగా ఎల్లవేళలా నాకు రక్షణ ఇస్తున్నారు’’

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి